ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏమిటంటే మన పూర్వ కాలం నుంచి రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగి పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉండేవారు. నిజంగా పడుకునే ముందు పాలు తాగటం వలన హాయిగా నిద్రపడుతుందా? అది కాకుండా ఇంకా ఏమైనా ఆరోగ్య లాభాలు ఉన్నాయా? ఇంకేమైనా కష్టసుఖాలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకుందాం.

మన ఆరోగ్యం దృష్ట్యా మంచి అలవాటును అలవర్చుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పెంచుకుని ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలిసిన విషయమే, మన పెద్దలు చెప్పేవన్నీ చాదస్తం అని మనం ఊరికే కొట్టిపాడేస్తాం, ఇప్పుడు ఈ మహమ్మారి వచ్చిన తర్వాత మంచి పద్ధతులు ఏమిటి అని ప్రపంచం మొత్తం తెలుసుకొని అలవాటు చేసుకుంటున్నారు. ఇమ్మ్యూనిటి పెంచుకోవడం కోసం ప్రపంచం మొత్తం మీద రీసెర్చ్ లో తెలిసింది ఏమిటంటే భారతీయ పురాతన సంస్కృతి, సనాతన ఆచారాలు, ఆహారపు అలవాట్లు ముఖ్య కారణమని తెలుస్తుంది, అందులో భాగంగానే అందరూ ఉదయాన్నే లేచి వేడి నీళ్లు తాగడం, సొంటి టీ తాగడం, అల్లం టీ తాగటం, ధనియాల కషాయం తాగడం చేస్తున్నారు.ప్రపంచం మొత్తం ఇప్పుడు ఫాలో అవుతున్నారు. అలాగే మన వాడే పసుపు కూడా చాలా డిమాండ్ వచ్చింది, ఈ మహమ్మారి కాలంలో పడుకునే ముందు పాలు తాగి పడుకోవడం చాలా మంచిది. సో దీనిలో ఉన్న గొప్ప విషయాలు ఏమిటో మనం తెలుసుకుందాం.

ముఖ్యంగా రోజు పడుకునే ముందు ఒక కప్పు పాలు తీసుకోవాలి, దీన్ని ఎలా తీసుకోవాలి అంటే పూర్తిగా చిక్కటి పాలు కాకుండా దానిలో కొద్దిగా నీటిని కలుపుకుని తీసుకోవాలి. అదేవిధంగా ఈ పాలలో ఆవు పాలు శ్రేష్టమైనవి, ఆవుపాలే దొరికినట్లు అయితే మీకు అమృత దొరికినట్లే, అలాగని ప్యాకెట్ పాలు తాగకూడదు, ఎందుకంటే ప్యాకెట్ పాలను నిల్వ కోసం కెమికల్స్ కలుపుతారు. మన భారతదేశంలో ఇప్పుడు దేవునికి పూజ చేసే సమయంలో కూడా మనము ప్యాకెట్ పాలను వాడుతున్నాము ఇది చాలా దురదృష్టకరం. భారతదేశంలో గో సంపద అన్ని దేశాల కంటే ఎక్కువగా ఉండేది. ఈ రోజుల్లో గోసంపద ను అభివృద్ధి చేయకుండా మనము నిర్లక్ష్యం చేయటం వల్ల చాలా అనారోగ్యాలు కొన్ని తెచ్చుకుంటున్నాము. మీరు పాలు తీసుకునేటప్పుడు అందులో చక్కెరకు బదులుగా బెల్లం వేసుకోవడం చాలా మంచిది.

బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా మంచిది. దాంతోపాటు కొద్దిగా పసుపు కూడా వాడటం వల్ల ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుంది. దీన్ని యెల్లో మిల్క్ అని అంటారు. శాస్త్రవేత్తలు చెప్పే ప్రకారం ఇలా పసుపు బెల్లం వేసుకొని తాగడం వల్ల ట్రిప్టోఫాన్ అనే ఒక ప్రోటీన్ రిలీజ్ అవుతుంది. ఈ ప్రోటీన్ మన మెదడు లో రిలీజ్ అయ్యే సెరోటోనిన్ ప్రేరేపిస్తుంది. దీని వల్ల మనకు నిద్ర తొందరగా హాయిగా పడుతుంది. దీనివల్ల బరువు కూడా తగ్గుతారు, ఎందుకంటే సరిగ్గా నిద్ర పట్టక పోవడం వల్ల డిప్రెషన్ వచ్చి వెయిట్ పెరుగుతారు. ఈ రోజుల్లో ఎంతోమంది నైట్ డ్యూటీ చేస్తూ చాలా డిప్రెషన్కి లోనవుతున్నారు, సరిగ్గా నిద్ర పట్టక. కావున ఇలా బెల్లం, పసుపు కలిపిన పాలు పడుకునే ముందు తాగటం వల్ల మీకు హాయిగా నిద్ర పడుతుంది. మీరు ఒకవేళ బరువు పెరగాలి అనుకుంటే ఈ పాలను సాయంత్రం ఏడు గంటల సమయంలో మరిగించికొని దాన్ని చల్లారనివ్వాలి, వాటిని తొమ్మిది గంటల ప్రాంతంలో చక్కెరకు బదులుగా తేనె కలుపుకొని తాగండి.

ఇలా తాగడం వల్ల మీ శరీరం బరువు పెరగటం మొదలవుతుంది. కావున సన్నగా ఉన్నవారు తేనె కలుపుకొని పాలు తాగండి, లావుగా ఉన్న వాళ్ళు మాత్రం బెల్లం కలుపుకొని తాగండి, బరువు ఉన్న వాళ్లు ముఖ్యంగా బెల్లం తో పాటు పసుపు కొద్దిగా మిరియాల కూడా వాడితే చాలా మంచిది. మనం తీసుకునే ఈ పాలు మరీ వేడిగా ఉండకూడదు అలాగని మరీ చల్లగా ఉండకూడదు. కావున మన పూర్వీకులు, పెద్దలు చెప్పినట్లు పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకోవడం ఎంతో మంచిది. ముందుగా ఈ పాలని పిల్లలకు తాపించి పడుకోబెట్టిన తరువాత పెద్దలు పడుకోవాలి. దీని ద్వారా పిల్లలు, పెద్దలు కూడా నిద్రపోతారు. ఇలా పిల్లలకు రోజు నైట్ పూట పాలు తాగడం వల్ల వాళ్ల యొక్క ఇమ్మ్యూనిటి పెరుగుతుంది.

వారు ఉదయం లేచిన తర్వాత రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు, చదువుకోవడానికి అయినా సరే మెమరీ పవర్ పెరగడానికి అయినా సరే ఈ గోరువెచ్చని బెల్లం పాలు చాలా బాగా ఉపయోగపడతాయి. సో నేటి బాలలే రేపటి పౌరులు గనుక మనము ప్రతి రోజు పిల్లలకు పాలు తాపించడం చాలా ముఖ్యం. అందుకే మా తెలుగులో సామెతలు కూడా ఉన్నాయ్, పెద్దల మాట చద్దిమూట, అలాగే బామ్మ మాట బంగారు బాట అని కూడా చెబుతారు.