బేబీ అనీ.. ఇలా చెప్తే బహుశా ఎవ్వరికీ అర్ధం కాదేమో..! అదే ‘రాజన్న’ సినిమాలో మల్లమ్మ అంటే చాలా మందికి అర్ధమయ్యే అవకాశం ఉంటుంది. ఆ చిత్రంలో రాజన్న(నాగార్జున) కూతరిగా చేసింది బేబీ అనీ..! దానికంటే ముందు ‘అనుకోకుండా ఒకరోజు’ ‘స్టాలిన్’ ‘విజయదశమి’ ‘అతిథి’ ‘స్వాగతం’ ‘రెడీ’ ‘మిత్రుడు’ ‘ఏక్ నిరంజన్’ ‘కేడి’ వంటి చిత్రాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. అయితే ‘రాజన్న’ చిత్రమే ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు.

ఆ చిత్రంలో తెలంగాణ యాసలో మాట్లాడే చిన్నారిగా కనిపించింది అనీ..! అంతేకాదు ఆ చిత్రంలో అనీ నటనకు గాను.. నంది మరియు ఫిలింఫేర్ అవార్డులు కూడా వరించాయి. ‘రంగస్థలం’ చిత్రంలో కూడా ప్రాముఖ్యమైన పాత్రను పోషించింది అనీ..! అంతేకాదు ఇటీవల వచ్చిన ‘లూజర్’ అనే వెబ్ సిరీస్ లో కూడా కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం అనీ మరిన్ని వెబ్ సిరీస్ లలో నటించడానికి రెడీ అవుతుందట. డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థల ద్వారా పాపులర్ అయితే సినిమాల్లో కూడా బిజీ అవ్వచ్చు అనేది ఈమె ఉద్దేశం కావచ్చు.

ప్రస్తుతం అనీ వయసు 19సంవత్సరాలు. ప్రస్తుతం అనీ చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. ఈమె ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అనీ లేటెస్ట్ ఫోటోలను చూసిన వారంతా.. ‘ఈమె నిజంగా ‘రాజన్న’ సినిమాలో నటించిన పాపేనా?!’ అంటూ ఆశ్చర్య పోతున్నారు. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

baby annie pics

baby annie pics

baby annie pics