సత్య సాయి జిల్లాలో కొత్త వ్యాధి స్క్రబ్ టైపస్ పేరుతో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. 20 ఏళ్ల కుర్రాడిని బలి తీసుకున్న బ్యాక్టీరియా. ఉన్న వ్యాధులు వైరస్లో చాలవన్నట్లు జనం మధ్యకు ఒక కొత్త బ్యాక్టీరియా ఎంటర్ అయింది.స్క్రబ్ టైపెస్ పేరుతో జనం లోకి వచ్చిన ఇన్ఫెక్షన్ ధర్మవరంలో ఒక 20 ఏళ్ల కుర్రాడి ప్రాణాలు తీసింది.

స్క్రబ్ టైపస్ వ్యాధితో ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన గవ్వల మధు గురువారం ప్రాణాలు కోల్పోయాడు. మధు పెనుగొండ వద్ద ఉన్న కియా పరిశ్రమలో పనిచేసేవాడు. 15 రోజుల క్రిందట జ్వరం రావడంతో ధర్మవరం అనంతపురంలోని హాస్పటల్కి వైద్యం చేయించారు.

తగ్గకపోవడంతో బెంగళూరు హాస్పిటల్లో చేర్పించారు అక్కడ చికిత్స తీసుకుంటూ మధు గురువారం ప్రాణాలు వదిలాడు. స్క్రబ్ టైపస్ వ్యాధితోనే అతను చనిపోయినట్టు ప్రచారం జరగడంతో జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక బృందాన్ని పోతుకుంటకు పంపించారు.

జిల్లాలో ఇదే తొలి కేసుగా గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్టు లోకల్ ఆఫీసర్లు వెల్లడించారు. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని కీటకం కుట్టడం ద్వారా మనుషులకు సోకుతుందని ఆయన అన్నారు.