Brs పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఎమ్మెల్యే లాస్య మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఆమె ఎక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పఠాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్డుపై

శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో, ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న లాస్య నందిత స్పాట్లోనే ప్రాణాలను కోల్పోయారు. కారు డ్రైవర్ కి తీగ గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు.

డ్రైవర్ నిద్ర మత్తు, ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. వెనుక సీట్లు కూర్చున్న లాస్య నందిత సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండి ఉంటే, ప్రాణాపాయం తప్పేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 13న కూడా ఆమె కారు ప్రమాదానికి గురైంది. నల్గొండలో నిర్వహి ంచిన బహిరంగ సభకు హాజరైన లాస్య, హైదరాబాద్ తీరుగు ప్రయాణంలో నార్కెట్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ,పక్కకి దూసుకు వెళ్లడంతో హోంగార్డు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో లాస్య స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ప్రమాదం జరిగే పది రోజులు గడపక ముందే ఆమె మరో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. పటాన్ చెరువు పై మేడ్చల్ వెళ్తున్న క్రమంలో సుల్తాన్పూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆమె స్పాట్లోనే మృతి చెందారు.

లాస్య ప్రయాణిస్తున్న కారు ముందు ప్రయాణిస్తున్న లారీని తప్పించబోయే, రోడ్డు పక్కన డివైడర్ ని ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. అతివేగం నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నార్కెట్ పల్లి ప్రమాదంలో ఆమె కారు దెబ్బతినగా, ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశారు. ఆ కారు కూడా ప్రమాదానికి గురి కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. గఠన స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్మార్టం చేసిన నిమిత్తం, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదం ఘటనపై ఆరా తీస్తున్నారు. తండ్రి సాయన్న కోరిక మేరకే లాస్య రాజకీయాల్లోకి వచ్చారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…

https://youtu.be/_utvxxmNQUw