ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేదా అని ఎలా తెలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. అంతే కాదు, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకు ఐశ్వర్యం కలగాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం.

లక్ష్మీ దేవి భక్తులను కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటుంది, ఆ తల్లి తన భక్తుల చేయిపట్టుకొని అతి జాగ్రత్తగా లక్ష్మి వైపుగా తీసుకువెళ్లి, విజయాన్ని సాధించి పెడుతుంది.

ఒకవేళ లక్ష్మి అంటే సంపద తమ వద్ద ఉంది కదా, అని నిర్లక్ష్యం ధోరణితో ప్రవర్తిస్తే తక్షణం ఆ ప్రదేశాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలి పెట్టి వెళ్లి పోతుంది. ఇప్పుడు మనం లక్ష్మీదేవికి, జేష్టాదేవి కి సంబంధించిన ఒక కథను తెలుసుకుందాం..నమ్ముకున్న భక్తులకు కైవల్య ప్రాప్తి అనుగ్రహిస్తుంది. శుచి, శుభ్రత ఉన్నచోట, పవిత్ర భావనలు కలచోట, ప్రకాశవంతమైన, ప్రదేశాల్లో మాత్రమే ఆ తల్లి ఉంటుంది.

లక్ష్మీ, ఐశ్వర్యానికి సిరిసంపదలకు, ధైర్యానికి, విజయానికి, అధిదేవత. ఇక జ్యేష్టాదేవి దారిద్ర్యానికి దేవత. వీరిద్దరూ ఒకేచోట ఉండలేరు, ఒకసారి వీరిద్దరికీ ఒక సందేహం వచ్చింది. అది ఏంటంటే ఇరువురిలో ఎవరు అందంగా ఉన్నారు అని, ఈ విషయం గురించి వాదన జరిగి, ఇలా వారిద్దరూ వాదించుకునే సమయంలో, దారిన ఒక వ్యాపారి పోవడం చూసి ఇక వాదన ఆపేసి, ఆ వ్యాపారిని అడిగి ఎవరు అందమైన వారు తెలుసుకోవాలని అనుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా జేష్టాదేవి, లక్ష్మీదేవి ఆ వ్యాపారి దగ్గరకు వెళ్లారు. ఆ వ్యాపారితో ఇలా అన్నారు, వ్యాపారి మా ఇద్దరిలో బాగా అందంగా ఎవరు ఉన్నారు అని అడిగారు.

అదే విధంగా వారు ఇద్దరు ఎవరో కూడా వివరించి చెప్పారు. వారిద్దరూ ఎవరో తెలుసుకుని ఇక వ్యాపారికి చెమటలు పట్టాయి. దారిద్ర దేవత ఐశ్వర్య దేవత ఇద్దరు కంటికి కనిపించి, అలా అడిగే సరికి వ్యాపారికి నోటమాట రాలేదు. వారిద్దరూ ఒకేసారి కనిపించిన అందుకు సంతోషించాలో, లేదా బాధపడాలో అర్థంకాలేదు. ఏదైతే అది అవుతుందని వ్యాపారి ఆ దేవతలు ఇద్దరికీ నమస్కరించి, ఇలా అన్నాడు. మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి.