నిత్య జీవితంలో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగింప జేసే కొన్ని గొప్ప శకునాలు ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ శకునాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. శకునాల కు సాధారణంగా అందరు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కొన్ని శకునాలు కనిపిస్తే జీవితంలో తొందరగా అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయని శాస్త్రాలలో చెప్పారు. ఎప్పుడైనా సరే ఇంట్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా తిరిగితే అది చాలా మంచి శకునం. తొందరలోనే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

అలాకాకుండా ఎర్ర చీమలు ఇంట్లో గుంపులు గుంపులుగా తిరిగితే మాత్రం ధననష్టం కలుగుతుంది. కాబట్టి మీ ఇంట్లో చెక్ చేసుకోండి. నల్ల చీమలు తిరిగితే మాత్రం వాటిని కదిలించవద్దు ఎందుకంటే అవి ఐశ్వర్య ప్రాప్తికి సూచిక. ఎర్ర చీమలు తిరుగుతూ ఉంటే మాత్రం కొద్దిగా ధననష్టం కలిగే అవకాశం ఉంటుందని గుర్తించండి. ముందే జాగ్రత్త పడండి. అలాగే ఎప్పుడైనా సరే మీరు ముఖ్యమైన పనిమీద బయటకు వెళుతున్నప్పుడు మీకు ఎదురుగా గేదె వస్తే అది చాలా మంచి శకునం. గేదె ఎదురు వస్తే అది ఏ పనైనా తలపెట్టిన ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది.

ఒక్కోసారి పని మీద బయటకి వెళ్లేటప్పుడు పక్షి మన మీద రెట్ట వేస్తూ ఉంటుంది పక్షి రెట్ట వేస్తే అందరూ చిరాకు పడుతూ ఉంటారు కానీ, పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పక్షి రెట్ట వేస్తే అది చాలా అదృష్టం, గొప్ప శకునం రాబోయే అదృష్టానికి దానిని సంకేతంగా భావించాలి, అని శాస్త్రాలలో చెప్పారు. అలాగే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు మనకు ఎడమ వైపు నుండి కుక్క అరుపు వినిపిస్తే చాలా మంచిది. అలాగే పంది అరుపు వినిపించిన కూడా చాలా మంచిది. ఇంకా

మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియోని చూడండి.