ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… ఒక్కోసారి మొబైల్ చేతిలోంచీ జారి నీటిలో పడుతుంది. లేదా వర్షపు నీటిలో తడుస్తుంది. అరెర్రే అని వెంటనే నీటిలోంచీ తీసినా…

అప్పటికే వర్షం నీరు మొబైల్ లోపలికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత స్క్రీన్ రంగులు మారుతూ ఉంటుంది. టచ్ ప్యాడ్ సరిగా పనిచెయ్యదు.ఇలాంటి నీటిలో పడిన, తడిసిన ఫోన్ల విషయంలో మొబైల్ కంపెనీలు కూడా తమకు సంబంధం లేదని చెబుతాయి.

ఇలాంటి సమయంలో నిరాశ పడకుండా కొన్ని చర్యలు తీసుకుంటే… మొబైల్ తిరిగి పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫోన్ తడిగా ఉంటే ముందుగా దాన్ని ఆఫ్ చేయండి. ఎందుకంటే, తడి స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం వల్ల డ్యామేజ్ రిస్క్ మరింత పెరుగుతుంది. అలాగే శుభ్రమైన గుడ్డ తీసుకుని బాగా తుడవాలి. తర్వాత టిష్యూ పేపర్లను మొబైల్‌కి బాగా చుట్టాలి.

తడి ఫోన్‌కు హెడ్‌ఫోన్‌లు లేదా మరేదైనా కేబుల్ కనెక్ట్ చేసి ఉంటే, వెంటనే వాటిని తీసివేయండి. అదేవిధంగా, SIM కార్డ్, మెమరీ కార్డ్‌ని కూడా తీసివేయండి. ఆ తర్వాత, అన్ని వైపులకూ ఫోన్‌ను వంచుతూ షేక్ చేయండి. తద్వారా నీరు బయటకు వస్తుంది.

ఆ తర్వాత మొబైల్‌ని బియ్యంలో ఉంచవచ్చు. బియ్యం.. తేమను గ్రహిస్తుంది. లేదా గాలి చేరని పెట్టెలో ఉంచవచ్చు. ఇలా 24 గంటలపాటూ ఉంచితే… మొబైల్ తిరిగి పనిచేస్తుంది. ఒకవేళ పనిచెయ్యకపోతే.. సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లడం బెటర్.