తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం కొండయ్య పేటకు చెందిన ద్రోణ వీర్రాజు, జ్యోతి కొన్నల కిందట మనస్పర్ధల కారణంగా విడిపోయారు.దీంతో జ్యోతి 10 ఏళ్ల కుమార్తె ప్రవీణ కుమారి అలియాస్ మానస, తన తల్లి సునీతతో కలిసి పట్టణ శివారులోని ఎన్టీఆర్ నగర్లో ఉంటుంది.

రంగంపేట మండలం వడిషలేరుకు చెందిన బత్తిన నాని జ్యోతి కి సమీప బంధువు. వరుసకు మేనల్లుడు అవుతాడు. ఐదేళ్లుగా వీళ్ళిద్దరి మధ్య సానిహిత్యం నడుస్తోంది. అయితే తన కుమార్తె ఎదుగుతుందని ఇంటికి రావడం సరికాదని అంటూ, కొన్నాళ్లుగా నానిని జ్యోతి దూరం పెడుతుంది. అదే తట్టుకోలేని నాని తమసాన్నిహిత్యానికి అడ్డంగా ఉన్న మానసను మట్టు పెట్టాలని, నిర్ణయించుకున్నాడు.

అందులో భాగంగా బయటకు తీసుకెళ్తానని ఈనెల 19న మానసనూ తన బైక్పై ఎక్కించుకొని స్థానిక కట్టమూరు కొంత రోడ్డులోకి తీసుకువెళ్లి, ముందు వేసుకున్న పథకం ప్రకారం హతమార్చాడు. బయటకు వెళ్లిన మనసా ఎంతకు ఇంటికి రాకపోవడంతో జ్యోతి ఈనెల 24 పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు ఆరంభించిన పోలీసులు అనుమానితుడిగా ఉన్న నానిని, అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టేందుకు ప్రయత్నించారు.

అతడు పరారీలో ఉన్నాడని గుర్తించారు. మరోవైపు బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కట్టమూరు పొంతల బాలిక మృతదేహాన్ని, ఆదివారం రాత్రి గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆ బాలిక మృతదేహం పూర్తిగా పాడైపోయింది.

కుక్కలు ఈడ్చుకు రావడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. చివరకు దుస్తులు ఆధారంగా మృతదేహం మనసాదేనని గుర్తించారు. చిన్నారి మృతదేహానికి పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించి, సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మానసహత్యకు కారకుడైన నాని ఫోటోను పోలీసులు విడుదల చేశారు.

https://youtu.be/EiHEMQ4AbSs