మనకు ఉండే కొన్ని అలవాట్ల వల్ల మెదడుకి హాని కలుగుతుందని, ఇటీవల వివిధ పరిశోధనల ద్వారా కొందరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

మెదడుకు ఎక్కువ నష్టం తగినంత నిద్ర లేకపోవడం వల్లే జరుగుతుందని న్యూరాలజీ అండ్ వెల్ సెంటర్ ఆఫ్ అమెరికా వెల్లడించింది. పెద్దలు రోజుకి 7 నుండి 8 గంటలు పడుకోవాలని రాత్రిపూట నిద్రపోతే మరింత మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మెదడు నిద్రలో విశ్రాంతి తీసుకుని కొత్త కణాలను సృష్టిస్తుంది, కనీసం ఏడు గంటల నిద్ర లేకపోతే కొత్త కణాలు ఏర్పడవు. దీంతో మనం ఏవి గుర్తుంచుకోలేం, ఏకాగ్రత కుదరదు చికాకుగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు నిద్రలేమి వల్ల అల్యూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం రాత్రంతా ఆహారం లేకుండా ఉన్న తర్వాత, ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తుంది. కానీ చాలామంది బ్రేక్ఫాస్ట్ తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో పడిపోయి, మెదడుపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మెదడుకు నష్టం కలుగుతుంది, మెదడులోని కణాల సారాజ్యం తగ్గిపోతుంది. పోషకాల లేమి వల్ల మెదడు సాధారణ పనితీరు దెబ్బతింటుంది. తగినంత నీరు తాగకపోవడం:- మన మెదడులో 75% నీరే ఉంటుంది. మెదడు సామర్థ్యం మేరకు పని చేయాలంటే దానికి తగినంత నీటితో హైబ్రిటేటెడ్ గా ఉంచాలి.

తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల మెదడులోనే కణజాలాలు కుషించుకుపోయే, వాటి పనితీరు క్షీణిస్తుంది. దాంతో మనం పాక్షికంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. పెద్దలు కనీసం రోజుకు రెండు లీటర్ల నీళ్లు తాగాలి అని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తుల వయసు ఆరోగ్యము బరువు వాతావరణ పరిస్థితిలో జీవన విధానాన్ని బట్టి వారు తాగాల్సిన నీటి మోతాదు పెరగవచ్చు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.