శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి.శరీరం లో 500 వందల పనులను కాలేయం చేస్తుంది. కాలేయం దెబ్బతింటే భయంకరమైన వ్యాధులు వస్తాయి. కాలేయం దెబ్బతినడానికి ముఖ్యకారణాలు జ్వరం జలుబు వంటివాటికి డాక్టర్ సలహా లేకుండా చాలా మందులు వాడేస్తుంటారు.

అంతేకాకుండా కొంతమంది మద్యంతాగడం వలన, జంక్ ఫుడ్, ఒత్తిడి, మానసిక ఆందోళనలు ప్రభావం చూపిస్తాయి. లివర్ ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే జీర్ణవ్యవస్థలో కీలక మార్పులు వచ్చి వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. మన వంటగదిలోనే ఉండే కొన్ని వస్తువులతో మన లివర్ని క్లీన్ చేసుకోవచ్చు.

ఆ వస్తువులతో డీటాక్స్ చేసి ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాం. మనం తీసుకోవలసింది సొరకాయ. సొరకాయ అంటే చాలా మంది ఇష్టపడరు. సొరకాయ లో కాల్షియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ సి, బీ కాంప్లెక్స్ ఉంటాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. జీర్ణంకావడంలో సహాయపడి యూరినరీ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. సొరకాయ వలన లివర్లో వాపును తగ్గిస్తుంది.

తర్వాత కొత్తిమీర లివర్ కిడ్నీ సంబంధ వ్యాధులు నివారిస్తుంది. కిడ్నీ, లివర్లను శుభ్రం చేసి వాపును తగ్గిస్తుంది. సొరకాయ గుప్పెడు కొత్తిమీరలో కొంచెం నీరు కలిపి మిక్సీ పట్టి జ్యూస్లా తయారు చేయాలి. తర్వాత పసుపు.పసుపు మంచి యాంటీబయోటిక్గా పనిచేసి శరీరం మొత్తాన్ని శుభ్రం చేస్తుంది. కాలేయంలో ఏర్పడిన విషపదార్థాలను బయటకు పంపించి కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో అరచెక్క నిమ్మరసం కొంచెం బ్లాక్ సాల్ట్ కలిపి తాగాలి. నల్ల ఉప్పు లేకపోతే రాళ్ళ ఉప్పు కిచెన్ సాల్ట్ వాడుకోవచ్చు. ఈ జ్యూస్ బ్రేక్పాస్ట్ చేసిన అరగంట తర్వాత తాగాలి.  ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో అద్బుతంగా పనిచేస్తుంది. ఇదేకాకుండా కిస్మిస్ ని నీటిలో మరగబెట్టి తాగినా కూడా కాలేయం శుభ్రపడుతుంది. గ్రీన్ టీ, ఆపిల్ సిడార్ వెనిగర్ కూడా  నాచురల్ గా లివర్ ను శుభ్రపరుస్తాయి.వారంలో ఒకసారైనా పాలకూర, బీట్రూట్ కివీ,ఆరెంజ్ వంటి విటమిన్ సి ఉండే ఆహారం తీసుకోవడంవలన కాలేయ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.