కుక్క అనగానే గుర్తుకు వచ్చేది విశ్వాసం, అంతలా విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచే కుక్క పట్ల అందరికీ సదాభిప్రాయమే ఉంటుంది. కుక్కల పట్ల మనిషి అనేక మూడవిశ్వాసాలను కలిగి ఉండటం కూడా ఆశ్చర్యమే,

కుక్క ఏడిస్తే అరిష్టమని, ఎవరో చనిపోతారని అందుకే దానికి తెలిసి ఏడుస్తుందని మన పెద్దలు అంటూ ఉండటం వినే ఉంటాం. అందుకే వీధుల్లో కుక్కలు ఏడుస్తున్నప్పుడు వాటిని తరిమికొట్టేవారు పెద్దలు, కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉంటాయని వాటికి చెడు జరిగే అంశాలు ముందుగానే తెలుస్తాయని, ఎవరైనా చనిపోయే ముందు వాటికి ముందే తెలిసిపోతుందని,

ఇటువంటి నమ్మకాలన్నీ కూడా గ్రీకుల కాలం నుండి వచ్చాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి. మరి విశ్వాసానికి మారుపేరైన కుక్కను ఇంట్లో లేదా పక్కింట్లో ఎవరైనా పెంచుకోవచ్చా? పెంచుకుంటే మంచిదేనా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు కుక్కకు ఆహారం పెడితే ఎంత పుణ్యం వస్తుందో తెలిపే కథను విందాం. పాసి పట్టణంలో ధనవంతుడు అయినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, అతను ప్రతిరోజు దానధర్మాలు చేసేవాడు, దానికి తోడు మిక్కిలి ధైర్యభక్తి కలవాడు,

మరియు యజ్ఞ యాగాదులు కూడా చేసేవాడు, ఒక యాగంలో అన్ని దానం చేయడంతో కుటుంబ పోషణకు అతని వద్ద డబ్బులు లేకుండా పోయాయి. పక్క ఊరిలో ఒక పెద్ద షేటు నివసిస్తూ ఉన్నాడని అతడు ఇతరుల పుణ్యంను కొని ధనం ఇస్తాడని, బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పి వారి వద్దకు వెళ్లి మీ పుణ్యాలు అన్నీ కొంత డబ్బు తీసుకురండి, తద్వారా వ్యాపారం మళ్లీ ప్రారంభం చేయవచ్చు అని సలహా ఇస్తుంది. బ్రాహ్మణులు మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు కానీ, భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధపడక తప్పలేదు.

దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకుని ప్రయాణం అవుతాడు, అతను అలా నడుచుకుంటూ అడవిలో నుండి పోయే వేళ ఆకలి కావడంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుని, రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్క పిల్లలతో ఎదుట నిలబడుతుంది. పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరిలోనికి వెళ్లలేకపోయింది, బ్రాహ్మణునికి అ కుక్కను చూసి బాధగా అనిపించింది, జాలిపడి తన దగ్గర ఉన్నా ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు. కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో వేయగానే త్వరగా రొట్టె తినేసింది. కానీ దాని ఆకలి తీరలేదు. ఇంకా ఆకలితో ఉండటంతో బ్రాహ్మణుడి వైపు చూడసాగింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…