ఇంటి ముందు అందమైన మొక్కలు ఉంటే కనుక ఇల్లు చూడడానికి ఎంతో ముచ్చటగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అలాగే స్వచ్ఛమైన గాలిని కూడా మొక్కలు అందిస్తూ ఉంటాయి.

అందం ఆరోగ్యం మాత్రమే కాకుండా, కొన్ని మొక్కలు వాస్తు ప్రకారం అదృష్టాన్ని కూడా అందిస్తాయి. అయితే ఏ మొక్కలు అదృష్టాన్ని అందిస్తాయి ఏ దిశలో ఉంచితే మంచిది అలాగే కొన్ని మొక్కలు నెగిటివిటీని కూడా తెస్తాయి. వాస్తు ప్రకారం వాటిని ఇంట్లో పెంచకపోవడం మంచిదని కూడా వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ఇంట్లో పెంచుకోవలసిన మొక్కలలో ప్రధానమైన మొక్క ఏమిటి అంటే, తులసి మొక్క తులసి మొక్క దేవతా స్వరూపంగా భావిస్తూ ఉంటాం. తులసి చెట్టుకు హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైన స్థానం ఉంది. ఈ తులసి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఇది ఇంట్లో ఉంటే కనుక ప్రతికూల సమస్యలు తొలగిపోతాయి.

ఇవే కాకుండా చెట్టు ఆకులను జలుబు దగ్గు వంటి వ్యాధులను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది తులసి మొక్కను తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ పెంచుతూ ఉంటారు. కానీ ముఖ్యంగా దక్షిణ దిశలో పెంచడం చాలా మేలు చేస్తుంది. ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో ఉండేలాగా చూసుకోవాలి. దక్షిణ దిశలో యముడు యొక్క ప్రభావం అనేది అత్యధికంగా ఉంటుంది.

ఆ యముడి ప్రభావం నుండి మనల్ని విడిపించడానికి ఈ తులసి మొక్క దోహదం చేస్తుంది. కాబట్టి తులసి మొక్కను ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. అలాగే మరొక చెట్టు శమీ చెట్టు, ఈ చెట్టుని ఎక్కువగా శని దేవుడికి ప్రియమైన మొక్కగా భావిస్తూ ఉంటారు. ఈ చెట్టు ఇంటి ముందు పెట్టి ప్రతిరోజు దానిని పూజించాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

మీ ఇంట్లో కనుక ఉంటే వ్యాధులు అనారోగ్య సమస్య తొలగిపోతాయి. అలాగే అప్పల బాధలు కూడా తొలగిపోతాయి. శమీ చెట్టుకి అంత విశిష్టత అనేది ఉంటుంది. మరొక మొక్క మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. ఇంట్లో ఈ మొక్క ఉంటే లక్ష్మీదేవి ఆనందిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి ముఖ్యంగా మనీ ప్లాంట్ ని ఎప్పుడు కూడా ఆగ్నేయ దిశలో ఉంచాలి. ముఖ్యంగా కొన్ని పరిహారాలకి అలాగే ఆరోగ్య ప్రయోజనాలకి ఈ యొక్క మనీ ప్లాంట్ మొక్క అనేది, చాలా ఉపయోగపడుతుంది.