2024 మార్చి 8న మహాశివరాత్రి రాబోతోంది. ఏటా 5 రకాలైనటువంటి శివరాత్రులు వస్తాయి, అందులో మొదటిది నిత్య శివరాత్రి అంటే ప్రతిరోజు శివారాధన చేస్తారు.

రెండవది పక్ష శివరాత్రి అంటే ప్రతి నెల శుద్ధ బహుళ చతుర్దశి లలో శివార్చన చేస్తారు. మూడవది మాస శివరాత్రి అంటే ప్రతినెలా బహుళ చతుర్థి నాడు మాస శివరాత్రి. నాలుగవది మహాశివరాత్రి అంటే మాగభకుల చతుర్దశి నాటి సర్వ శ్రేష్టమైన శివరాత్రి.

ఐదవది యోగశివరాత్రి అంటే యోగులు యోగ సమాధిలో ఉంది చేసే శివ చింతన. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పవిత్ర దినం. ఉపవాసం శివార్చన జాగరణ ఈ మూడు శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు.

సమస్త జగత్తును దహించి వేసేందుకు, సిద్ధమైన అలా హలాన్ని తన గొంతుకలో ఉంచుకున్న నీలకంఠుడు, మహా ధర్మశారుని కి తన శరీరంలో అర్ధ భాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు, తనను యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయుడిని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన, భక్తజన బాంధవుడు ఈశ్వరుడు.

పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం, శివ అను పదానికి మంగళకరం శుభప్రదం అని అర్థం. శివుని పుట్టుక గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కైలాస నాధుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రి గా పరిగణించబడుతుంది యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.