హిందువుల అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. శివ భక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామ స్మరణతో మారు మోగిపోతాయి.

ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రి వచ్చింది. శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమి పైకి వస్తాడని భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. శివ అంటే మంగళకరం అని అర్థం. కైలాసనాధుడు బోలా శంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు.

బాగా మాసం బహుళ చతుర్థి రోజు అనంత భక్తకోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్నారని ఒక నమ్మకం. ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివునిని ఎలా పూజ చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మహాశివరాత్రి రోజున అనగా ఈనెల మార్చి ఎనిమిదవ తేదీన ఇంట్లోని వారందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఈరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయడానికి ప్రయత్నించండి. ఈరోజున చేసే తలస్నానము కేవలం నీటిలో మాత్రమే చేయాలి. ఎటువంటి షాంపూ పెట్టకూడదు. మహాశివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది.

ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్నానాధి కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శివ పూజ కోసం సిద్ధం అవ్వాలి. ఈ రోజున శివుడిని లింగ రూపంలో పూజిస్తే చాలా మంచిది కనుక శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా మీరు పూజ చేయాలి అనుకుంటే లింగరూపాన్ని తయారు చేసుకుని శివ పూజ చేసుకోవాలి. అది ఎలాగంటే ముందుగా పంట పొలాల్లో లభించే బంక మట్టిని తీసుకొని శివలింగ రూపంగా తయారు చేసుకోవాలి. మట్టితో తయారుచేసిన లింగరూపాన్ని శివుడిగా భావించి గంధము రాసి మీ పూజ గదిలో పెట్టండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.