మహిళలు ఈ వస్తువులు ధరిస్తే సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. స్త్రీలు ఈ వస్తువులు ధరించడం వలన వారికి ఐశ్వర్యం కలుగుతుంది. స్త్రీలకు ఐశ్వర్యం కలిగితే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రాప్తించినట్లే.

మహిళలు కొన్ని వస్తువులు ధరించడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువుతీరి ఉంటుంది. అష్టాదశ పురాణాలలో ఆ వస్తువుల గురించి చెప్పారు. స్వయంగా పార్వతీదేవి ఈ విషయాన్ని చెప్పింది. ఒకసారి దేవేంద్రుడి భార్య అయినా సచిదేవి యమధర్మరాజు భార్య అయిన శ్యామలాదేవి వశిష్టుని భార్య అయిన అరుంధతి దేవి అగస్యముని భార్య అయినటువంటి లోపాముద్ర దేవి కొంతమంది పతివ్రతలంతా కూడా కలిసి కైలాసానికి వెళ్లారు.

కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటారు. అప్పుడు ఈ పతివ్రతలు అందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణలు చేసి, భక్తితో నమస్కారం చేసి పార్వతీదేవిని ఈ విధంగా ప్రశ్నించారు. అమ్మ గౌరీదేవి స్త్రీలకు ఆరోగ్యము ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని ఇచ్చే సర్వమంగళ దేవి నీవే తల్లి, స్త్రీలు ఏ ఏ వస్తువులు ధరిస్తే వాళ్లకు ఆయుష్షు ఆరోగ్యం ఐశ్వర్యము కలుగుతుందో, వివరించు తల్లి అని పతివ్రతలు అందరూ కూడా అడిగినప్పుడు, పార్వతీదేవి స్త్రీలు ఏ వస్తువులు ధరిస్తే ఐశ్వర్యాన్ని పొందుతారు, అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పింది.

ఆ వస్తువులు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీలు ఐశ్వర్యాన్ని పొందాలి అంటే పాదాలకు పసుపు రాసుకోవాలి,పెళ్లి సమయం లో మాత్రమే మగవారికి పసుపు పూస్తారు, ఇంకెప్పుడూ కూడా మగవాడు పసుపు ధరించకూడదు. కానీ స్త్రీలు మాత్రం ప్రతి నిత్యం పసుపు రాసుకోవాలని చెప్పి సాక్షాత్తు పార్వతీదేవి ప్రతివతలు అయిన అందరికీ కూడా చెప్పింది. ప్రతినిత్యం స్త్రీలు పాదాలకు పసుపు రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి అంటే ముందు నేల మీద చిన్న వస్త్రం ముక్క వేసి ఆ వస్త్రం మీద పాదాలు పెట్టుకొని ఒక గిన్నెలో పసుపును పేస్ట్ లాగా కలిపి ఆ పసుపును పాదాలకు శుభ్రంగా రాసుకోవాలి. ఎలాంటి గ్యాప్ లేకుండా పొడిపొడిగా లేకుండా రాసుకోవాలి.

స్త్రీలు తప్పనిసరిగా గోరింటాకును పెట్టుకోవాలి. కళ్లకు కాటుక ధరించడం పెళ్లయిన ప్రతి స్త్రీ ప్రతినిత్యం పాపిట్లో సింధూరం లేదా కుంకుమను గాజులు ఆడవారు తప్పక చేతులకు గాజులు ధరించాలి కనీసం రెండు గాజులైనా సరే రెండు చేతులకు వేసుకోవాలి. అవి కూడా ఎర్రటివి లేవా ఆకోపచ్చటి రంగులో ఉన్న మట్టి గాజులను ధరిస్తే మీ దాంపత్యానికి దిష్టి అనేదితగలదు. మాంగల్యంలో నల్లపూసలు ఉండాలి. కాలి మెట్టెలు కూడా ధరించాలి. పసుపు కుంకుమ మంగళసూత్రం చేతికి గాజులు తలలో ఒక పువ్వు కాలిమెట్టలు ఈ 5 వస్తువులు ఉంటే వారిని ముత్తయిదువా అంటారు. అదేవిధంగా కాళ్లకు పసుపు చేతులకు గోరింటాకు కళ్ళకి కాటుక ఇవన్నీ పెట్టుకున్న స్త్రీ పరిపూర్ణమైన అమ్మవారి స్వరూపంగా మారుతుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.