మహా శివరాత్రి ఎంతో పవిత్రమైన పర్వదినం.భక్తులు ఉపవాసం ఉండి పరమశివుడిని పూజిస్తారు.ఇలా ఉపవాసం ఉన్నవారికి పరాశివుడి అనుగ్రహం లభిస్తుంది.

మహా శివరాత్రి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి పరమ శివుడిని పూజించి,రాత్రి జాగారం చేస్తారో అట్టి వారికి పరమ శివుడి అనుగ్రహంతో పాటు నరక ప్రాయం నుంచి తప్పిస్తాడు.అంతే కాకుండా వారి జీవితం సుఖ వంతం అవుతుంది.

ఇంట్లో వాళ్ళు రౌద్రంగా మాట్లాడటం కానీ నోటి నుండి చెడ్డ మాటలు రావడం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా చేయకూడదు. అంటే ఈ విధంగా మీరు ఈ రోజంతా కూడా శివనామస్మరణతో గడుపుతూనే ఉంటూ ఉపవాసం ఆచరిస్తూనే అలాగే శివ భగవానుని ఆరాధిస్తూనే ఆ శివుని అనుగ్రహం తప్ప కలుగుతుంది. ఎవరిని దూషించకూడదు. ఎవరితో గొడవ పడకూడదు. ఎవరితో అరవకూడదు. అలాగే చెడు మాటలు మాట్లాడకూడదు. ఎవరిని అవమానపరచకూడదు. ఇటువంటి నియమాలు కచ్చితంగా పాటించాలి.

అలాగే అభిషేకం చేసే సమయంలో లేకపోతే మీ యొక్క వెంట్రుకలు కానీ శివుడి పై ఎట్టి పరిస్థితుల్లో కూడా పడకూడదు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో కానీ శివలింగాన్ని పై చెమట కానీ వెంట్రుకలు కానీ పడితే ఆ శివుడు ఉగ్రరూపం దాల్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా చేస్తే మీరు చేసే పూజకి ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి.

అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు కలవడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఈరోజు మీరు బ్రహ్మచర్యం పాటిస్తేనే మీరు చేసేటటువంటి పూజకి ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి ఇటువంటి నియమాలు మీరు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మీరు శివరాత్రి రోజు శివనామస్మరణ చేసినా కానీ ఉపవాసం ఉన్నా కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని అర్ధం చేసుకొని మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఇలాంటి పొరపాట్లు చేయకుండా శివ నామస్మరణతో శ్రద్ధతో శివుని పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.