సాజీవరం చేస్తున్న వ్యక్తితో వచ్చే నెల 12న పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నా ఒక యువతి,అనూహ్యంగా ఆదివారం తెల్లవారుజామున బలవన్ మరణానికి పాల్పడింది.

అత్తాపూర్ తానా పరిధిలోని జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇన్స్పెక్టర్ పులి యోగిరాజ్ వివరాల ప్రకారం, హైదరాబాద్ అత్తాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. మరో 15 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక సాఫ్ట్వేర్ సూసైడ్ చేసుకొని చనిపోయింది.

ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళగా ఆమె ప్రెగ్నెంట్ అని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన యువతి ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే బీహార్ రాష్ట్రానికి చెందిన భరద్వాజ్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి, ఇక్కడే స్థిరపడింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసే ఆమె గతంలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అతడితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మణికొండలో అద్దెకు దిగింది తనతో కలిసి పనిచేసే చింతల్ మెట్ కి చెందిన మహమ్మద్ అలీతో పరిచయం కాస్త, సహజీవనానికి దారితీసింది. ఈ క్రమంలోనే అతడు అత్తాపూర్ పిఎస్ పరిధిలోని హ్యాపీ హోమ్స్ కాలనీలో అపార్ట్మెంట్ ప్లాట్ ని అద్దెకి తీసుకొని, అందులో అతిధిని ఉంచాడు. వచ్చేనెల 12న ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

కాగా రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది ఆసుపత్రికి వెళ్లే డాక్టర్కు చూపించుకోగా, గర్భం ఉన్నట్లు చెప్పారు. అప్పటినుండి అతిధి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆదివారం తెల్లవారుజామున మహమ్మద్ అలీ కి ఫోన్ చేసి తాను తీవ్ర వత్తిడిలో ఉన్నట్లు చెప్పింది. ఆందోళనకు గురైన మహమ్మద్ ఫ్లాట్ కి చేరుకునేసరికి, అతిధి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. వెంటనే మహమ్మద్ అలీ అత్తాపూర్ పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

https://youtu.be/9MWaa9o67WU