రాజన్న సిరిసిల్ల జిల్లా గోసుకుపల్లి గ్రామంలో ముద్దం విద్య శ్రీ అనే యువతీ నివాసం ఉంటుంది. ఈ అమ్మాయి చిన్నప్పనుంచి బాగా చదువుకుంది.ఆ తర్వాత హైదరాబాద్ గచ్చిబౌలిలోనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోంది.

అల్లరు, ముద్దుగా పెంచుకున్న కూతురుకి ఆమె తల్లిదండ్రులు మంచి యువకుడికి ఇచ్చి వివాహం జరిపించాలని అనుకున్నారు. ఇందులో భాగంగా కూతురికి నిశ్చితార్థం కూడా జరిపించారు. మార్చి 17న పెళ్లి జరగాల్సి ఉంది, మరో 10 రోజుల్లో వివాహం ఉండడంతో, విద్య శ్రీ తల్లిదండ్రులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు.

ఇటీవల షాపింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. గురువారం రోజు విద్య శ్రీ కి కాబోయే భర్తతో ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్లాల్సి ఉంది.కానీ సోమవారం రోజు విద్య శ్రీ కి కాబోయే భర్త ఆమె ఉన్టున్న హాస్టల్ కి వెళ్ళాడు. అక్కడ ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే విద్యశ్రీ కూడా అక్కడ నుంచి నేరుగా హాస్టల్ గదిలోకి వెళ్ళింది. వెంటనే గది తలుపులు వేసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. అందులో ఉన్న షవర్ రాడుకు చున్ని తో ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.

చాలా సేపు గడిచిన విద్యశ్రీ గది నుంచి బయటకు రాకపోవడంతో, హాస్టల్ సిబ్బందికి కాస్త అనుమానం వచ్చింది. వెంటనే గదిలోని బాత్రూం తలుపులు బద్దలు కొట్టి చూడుగా విద్య శ్రీ షవర్ కు వేలాడుతూ కనిపించింది. హాస్టల్ సిబ్బంది నిర్వాహకులు ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు.

హుటహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.అనంతరం యువతి మృతదేహం నీ స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం హస్పత్రికి తరలించారు. పోలీసులు తల్లి తండ్రి కి సమాచారం అందించారు. అనంతరం స్వాధీనం చేసుకుని తరలించారు. ఆ తర్వాత పోలీసులు ఇదే విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇది తెలుసుకుని విద్యశ్రీ తల్లిదండ్రులు గుండెలు పగిలేల ఏడ్చారు.. పోలీసులు గంటపై కేసు నమోదు చేసుకునీ అన్నీ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.