కూతురు అంటే ప్రతి కన్నతండ్రి కి ఎంతో ప్రాణం, ఆడపిల్లపై వివక్ష కొనసాగుతున్న తండ్రి మాత్రం కూతురుని తన కన్నతల్లిలా భావిస్తాడు. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తాడు,

అడిగింది కాదనకుండా ఇస్తాడు. కూతురు కంట చెమ్మ చూడడానికి కూడా అసలు ఇష్టపడడు ఆ కన్న తండ్రి. అయితే ఇదంతా కూతురుపై తండ్రికి ఉన్న ప్రేమ, తన కూతురు గురించి అన్ని తనకే తెలుసని తాను తప్ప ఇంకెవరు ఆమెని బాగా ప్రేమించలేరని భావిస్తాడు. అందుకే పెళ్లి కూడా తాను చూసిన అబ్బాయిని చేసుకోవాలని కోరుకుంటాడు,

కానీ నేటితరం అలా కాదు తండ్రి ప్రేమను తండ్రిపై చూపుతోనే జీవితానికి మరొక ప్రేమను వెతుక్కుంటుంది. అయితే కూతురు ఎదిగే కొద్ది తండ్రిలో భయం మొదలవుతుంది, ప్రేమ పేరుతో తన కూతురు ఏ కసాయి వాడిని నమ్ముతుందో అన్న ఆందోళన ప్రతీ తండ్రీలో ఉంటుంది. ఇక 20 ఏళ్ల కన్నతండ్రి ప్రేమ నీ కాదని ఏడాది పరిచయం ఉన్న యువకుడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అసలు సహించలేడు ఆ తండ్రి. అయితే ఇలాంటి సంఘటనలు ఇంకా సమాజంలో జరుగుతూనే ఉన్నాయి.

కులం ఒక అడ్డు గోడ అయితే తనలా పెళ్లి చేసుకున్నవాడు సరిగ్గా చూసుకుంటాడో లేదో అన్న ఆందోళన మరొకటి. అందుకే ప్రేమ విషయం తెలవగానే తన మనసు మార్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరైతే కూతురుని ప్రేమించిన యువకుడి పై దాడులు చేస్తున్నారు. కొందరైతే కూతురు ప్రేమించిన యువకుడి పై దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు. చివరికి చంపడానికి కూడా వెనకాడడం లేదు అలాగే చేశాడు. ఇక్కడ ఒక తండ్రి అసలేం జరిగింది

అంటే ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఒక తండ్రి తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అన్న కారణంతో యువకుడి ఇంటిపై దాడి చేశాడు అల్లుడు అని కూడా చూడకుండా, అతనిపై కత్తి దూశాడు ఈ ఘటన నూజివీడు నియోజకవర్గం సీతారాంపురంలో గ్రామానికి చెందిన కందుల వంశీ శ్రావణి కొన్నాల్లుగా ప్రేమించుకున్నారు. వీరే ప్రేమకు పెద్దలు అంటూ చెప్పడంతో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి కోపంతో రగిలిపోయాడు, బంధువులతో కలిసి వంశి ఇంటికి వెళ్లి దాడి చేశాడు, పదునైన ఆయుధంతో వంశీ పై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వంశీయుని ఆసుపత్రికి తరలించారు, వంశీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శ్రావణి తండ్రి ఇతర బంధువులపై కేసు నమోదు చేశారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/-Fulp61TlDs