మరణించిన వారు మన కలలో కనిపిస్తే, అది దేనికి సంకేతం మన బంధువులు మిత్రులు రక్తసంబంధీకులు మరణిస్తే, వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మనకు కలలోకి వచ్చి ఉంటారు.

మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి. ఒకవేళ మీకే కనుక ఇలాంటి కలలు వస్తే వాటి గురించి భయపడవలసిన అవసరమే లేదు. హిందూ ధర్మ శాస్త్రాలలో ఈ కలలో గురించిన ఒక శాస్త్రవే ఉంది. అదే స్వప్న శాస్త్రం ఇందులో ప్రతి స్వప్నానికి సంబంధించిన పూర్తి జ్ఞానం లభిస్తుంది.

ఈరోజు మనం మరణించిన వారు మన కలలో కనబడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. స్వప్న శాస్త్రంలో ప్రతి స్వప్నానికి ఒక విశేషం ఉంటుంది. అది మనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పగలుగుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే, అదే వ్యక్తి మీ కలలో పూర్తిగా ఆరోగ్యంగా కనబడితే, ఆ మరణించిన వ్యక్తి మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, అతని జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది.

ఇక మీరు నా గురించి బాధపడవద్దు అని దాని అర్థం. ఇలాంటి కలలు కనక మీకు వస్తే ఇక మరణించిన వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా, ముందుకు సాగిపోవాలి. ఇక రెండవది ఒక వ్యక్తికి అకాల మృత్యువు సంభవిస్తే అతను మీ కలలో అనారోగ్యంతో కనబడితే, దాని అర్థం ఏదో ఒక కోరిక గురించి చెప్పబోతున్నాడని దాని అర్థం. మీరు దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అకాల మరణం సంభవించడం వల్ల ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండే ఉంటుంది.

దానిని అతను పూర్తి చేయాలి అనుకున్నాడు. కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు. ఒకవేళ మీకే గనుక అతని కోరిక గురించి ముందే తెలిసే, దానిని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. మీరు ఆ కోరికను తీరిస్తే ఆ మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుంది. దానితో పాటు మీ ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి. ఒకవేళ మీకు అతని కోరిక గురించి ముందే తెలిసిన మీరు ఆ కోరికను తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా, ఆ కోరికను మీరు తీర్చకపోతే అది మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.