ప్రతి ఒక్కరికి ధనం సంపాదించాలని, ఉన్నత స్థానాలకు వెళ్లాలని, జీవితం సులభంగా జీవించాలని, ఇలా ఎన్నో కోరికలు ఉంటాయి, అవన్ని నెరవేర్చుకోడానికి రోజు ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటారు, రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు, ఎండనకా వాననకా కష్టపడుతున్నారు, ఎన్నో త్యాగాలు చేస్తారు, పనిలో పడి పస్తులు కూడా ఉంటారు, ఇదంతా ఎందుకు అంటే, మీ కుటుంబానికి ఎలాంటి కష్టం తెలియకూడదు, అని మీ ప్రయాస ఎప్పుడూ పడే కష్టాలకు, ఒక రోజు ఒక మంచి రోజు ముహూర్తం చూసుకొని, ఫలితం లభించే పరిష్కారం కూడా, చేస్తే ఎంతో శుభదాయకంగా ఉంటుంది.

మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది, ఒక మంచి రోజు చూసుకొని పొద్దున్నే లేచి, ఏదో ఒక గుడికి వెళ్లి పూజ చేసుకొని ఇంటికి వచ్చి, ఇంట్లో కూడా పూజ చేసి, చాలా చిన్న కాగితాన్ని తీసుకోండి, కాగితంపై మీ మనసులోని కోరికను రాసుకొని, ఏదో ఒక దేవుడి విగ్రహం లేదా పట్టాల కింద, పెట్టాలి మీ కోరిక నెరవేరే దాకా, ఆ కాగితాన్ని అక్కడినుండి తీయరాదు, పటం లేదా విగ్రహం, కింద పెట్టడానికి వీలుగా ఉండాలని చిన్న కాగితాన్ని తీసుకోమని చెప్పడం జరిగింది.

ఇలా పెట్టిన తర్వాత నుంచి, రోజూ క్రమం తప్పకుండా ధూపదీపాలతో పూజలు చేయాలి, మీ కోరిక నెరవేరే దాకా ఎట్టిపరిస్థితుల్లోనూ, పూజ ఆగకూడదు, మీరు చేయలేని పక్షంలో మీ కుటుంబ సభ్యులను, ఎవరితోనైనా పూజ చేయమని చెప్పండి, మీ కోరిక తప్పక నెరవేరుతుంది, మీరు కూడా ఎన్నో కోరికలు నా మనసులో అనుకొని, అవి ఎలా తీసుకోవాలో తెలియక, సతమతమవుతూ ఉంటె తప్పకుండా ఈ పరిష్కారాన్ని చేసి, మంచి ఫలితాలను పొందగలరు అని భావిస్తున్నాం..