ఈసారి భోగి పండుగ ఆదివారం తో రాబోతూ ఉంది. భోగభాగ్యాలను తెచ్చే పండుగ ఇది ప్రసిద్ధి చెందింది. భోగి అంటే భోజనం భోగి అంటే దేవుడికి భోగం భోగి అంటే కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగడం.

భోగి అంటే పాతకు సెలవు పలికే కొత్త జీవితాన్ని ప్రారంభించడం. భోగి అంటే పిల్లలకు భోగంగా భోగా పళ్ళు పోయడం, భోగి అంటే అన్నిటిని అంగరంగ వైభవంగా ఆనందించడం, భోగి అంటే సూర్యుడిని ఆరాధించే అతి పెద్ద ఉత్సవం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగులోనే కళకళలాడుతూ ఉంటాయి.

మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజున, మనం భోగి పండుగ జరుపుకుంటూ ఉంటాం. కొత్త పంటలు ఇంటికి రావడం, అల్లుళ్ళు కూతుర్లు మనవాళ్ళు మనవరాలు ఇంటినిండా, ఆత్మీయులు స్నేహితులు ఆ వేడుక చూడడానికి, వేయికళ్లలో అద్దెకు తెచ్చుకున్న కూడా చాలావేమో అనిపిస్తుంది. పిల్లల ఆటపాటలు భావాలను ఆటపట్టించే మరదళ్ళు, మామగారిని కోరికలు కోరే కొత్త అల్లుళ్లు,

అందరికీ రకరకాల పిండి వంటలు తయారు చేసే అమ్మమ్మలు, మేనత్తలు ఇవన్నీ పండుగ సంబరాలను ఆస్వాదించేలా గా చేస్తాయి. అలాంటి భోగి రోజు బీరువాలో ఏమి పెడితే మంచిదో తెలుసుకుందాం. బీరువా కింద ఒక చిన్న గిన్నెను కానీ, చిన్న ప్రసాదం ప్లేట్లు గాని తీసుకోండి. దానిలో 6 లవంగాలను వేయండి, ఆ లవంగాల మీద చిటికెడు కుంకుమ వేయండి, తర్వాత భోగి మంటల దగ్గర బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదను తెచ్చి ఈ లవంగాల మీద చల్లండి.

ఎంత చల్లాలంటే ఒక స్పూన్ సరిపోతుంది. ఇలా లవంగాలు కుంకుమ భోగి మంటల్లోనే బూడిద వేసిన తర్వాత, ఆ ప్లేట్ ని తీసుకుని వెళ్లి ధనం దాచే బీరువా కింద పెట్టండి. పెట్టిన తర్వాత ఒక్కసారి బీరువాకు నమస్కారం చేసుకొని, ఆ బీరువాని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి, అమ్మ లక్ష్మీదేవి మా బీరువాలో ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండు తల్లి, మా బీరువా మొత్తం ధనంతో నిండిపోయేలాగా చూడు తల్లి, మాకు ధనానికి లోటు రాకుండా ఉండేలాగా చూడు తల్లి అని నమస్కారం చేసుకోండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.