జనవరి 15న సంక్రాంతి పండుగ రాబోతూ ఉంది, పండుగను భోగి సంక్రాంతి కనుమ అని మూడు రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి పేరులోనే ఉంది కాంతి, నిజంగా ఇది కాంతులకే పండుగ

సంబరాలు పండుగ, వాకిట్లో రంగురంగుల రంగవల్లికలు ఆకాశంలో అంతకంటే అందమైన గాలిపటాలతో, జరుపుకునే మహా శోభాయ మానమైన పండుగ ఇది. ఇది ఒక రోజు పండుగ కాదు నెల రోజుల పాటు సంబరాలు చేసుకునే వైభవం.

జ్యోతిష్య శాస్త్రంలో మేషం వృషభం ఇలా 12 రాశులు ఉన్నాయి. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు, సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే అది మేష సంక్రమణం. అలా ఏ రాశిలో సంచరిస్తే ఆ రాసి సంక్రమణంగా వ్యవహరిస్తాడు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించింది, మొదలు మకర రాశిలో ప్రవేశించడం వరకు సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి

అప్పటివరకు దక్షిణాయంలో సంచరిస్తున్న సూర్యుడు, ఉత్తరాయణంలో ప్రవేశించిన పుణ్యదినం కూడా ఇది సంక్రాంతి నెల మహా సందడిగా ఉంటుంది. చలిలో కూడా అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండి, వాకిట్లో కల్లాపే చల్లి రంగవల్లికలు తీర్చిదిద్దుతూ ఉంటారు. లేదా తెల్లవారుజామునే నిద్రలేచి ముగ్గులు వేస్తారు. అవకాశం ఉన్నవారు నది స్నానం చేస్తారు, పుణ్య నదులలో స్నానం చేస్తే అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి,

జ్ఞాననేత్రం తెచ్చుకుంటుంది. నదిలో మునిగి సూర్యుడికి ఆద్యం వదులుతారు, మకర రాశిలో ప్రవేశించిన సూర్యునికి నమస్కరిస్తారు. పితృదేవతలకు తర్పణాలు వదులుతారు, ఇళ్ళ ముందు సంక్రాంతి ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు పూలు పసుపు కుంకుమలు చల్లి, వాకిళ్లను కళాత్మకంగా రూపొందిస్తారు. గుమ్మాలు మావిడాకులు బంతిపూల తోరణాలతో, అలగాలతో అందాలు చిందిస్తూ ఉంటాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.