చట్నీ విషయంలో భార్య భర్తలు మధ్య గొడవ.. భర్త తిట్టడం తో భార్య ఆత్మహత్య…హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విషాదం చోటుచేసుకుంది. చట్నీ విషయంలో తలెత్తిన గొడవ, భార్య ఆత్మహత్యకు దారితేసింది.

ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో, చట్నీ ఎక్కువ వేసావ్ అంటూ రమణ భార్యతో గొడవపడ్డాడు. సోమవారం ఉదయం గది లోకి వెళ్ళగా భార్య చందన పలుమార్లు వీడియో కాల్స్ చేసింది,

అతడు స్పందించకపోవడంతో ఫోన్ చేసి కావాలనే తనతో గొడవ పడుతున్నావ్ అంటూ, పెద్దగా కేకలు వేసింది. తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది, అనుమానం వచ్చిన రమణ ఇంటి యజమానికి ఫోన్ చేసి త్వరగా ఇంటికి వెళ్ళమని కోరాడు.

యజమాని ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు పలగొట్టి లోపలికి ప్రవేశించగా, అప్పటికే ఆమె విగత జీవిగా మారింది. భర్త రమనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశాక కేసు నమోదు చేస్తానంటున్నారు.

ఇక కొత్తగూడెం జిల్లా కోకతండాకు చెందిన రమణ, ఖమ్మం జిల్లా పెగలపాడుకు చెందిన బానోతు చందనని, రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు, చందన ఒక ఆభరణాల దుఖనం లో పనిచేస్తుంది. వీరిద్దరూ బంజారా హిల్స్ ఇందిరానగర్ లో అపార్ట్మెంట్లో ఉంటున్నారు.