మనిషి అంటే మనసు. ఆ మనసుకు వచ్చే ఆలోచనలన్నీ మెదడు నుంచి ప్రేరేపితం అవుతూ ఉంటేనే మెదడు నుంచి వచ్చే ఆలోచనలు కూడా షార్ప్ గా ఉంటాయి.

మనం చేసిన ఆలోచనలుగానే చేసిన పనులు కానీ ఇవన్నీ కూడా మళ్లీ మెదడు కణాల్లో ఒక రికార్డు అయి కలెక్ట్ అవ్వాలి. జ్ఞాపకశక్తి బాగుండాలంటే ముందు బ్రెయిన్ సెల్స్ కుషించుకుపోకూడదు..జ్ఞాపకశక్తి బాగుండాలంటే బ్రెయిన్ సెల్స్ కావాల్సింది. ఫస్ట్ అన్నిటికంటే ప్రాణవాయువు..

దీనితో కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కూడా బ్రెయిన్ షార్ప్ చేసుకోవచ్చు.. ఆహార పదార్థాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా బాదంపప్పు: ఈ బాదం పప్పును నీటిలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం తీసుకున్నట్లయితే మీ బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది.. దీంట్లో ఉండే ఒమేగాత్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ను ఇంప్రూవ్ చేస్తాయి..

అలాగే వాల్ నట్స్:  వాల్ నట్స్ బ్రెయిన్ షార్ప్ గా పని చేయడానికి ముఖ్యపాత్ర పోషిస్తుంది. వీటిని నీటిలో నానబెట్టి రోజుకి రెండు తిన్న చాలు. మతిమరుపు లాంటి వ్యాధులనుంచి బయటపడవచ్చు..అలాగే అవిసె గింజలు: ఈ అవిసె గింజలను దోరగా వేయించి రోజుకు ఒక స్పూన్ పాటు తిన్నట్లయితే మీ బ్రెయిన్ సెల్స్ ను ఇంప్రూవ్ చేసే ఒమేగాత్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కావున అవిసె గింజలు తినడం కానీ లేదా పొడి రూపంలో వంటల్లో వాడుకోవడం లాంటివి చేయాలి..

అలాగే చియా సీడ్స్: ఈ చియా సీడ్స్ లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉన్నందున వీటిని నీటిలో నానబెట్టి జ్యూస్ల రూపంలో తీసుకున్నట్లయితే మీ బ్రెయిన్ సెల్ఫి ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది.. ఈ చియా గింజలు అధిక బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.. వీటితోపాటు జామ పండ్లు, చేపలు, పాలు, కిస్మిస్లు ఇలాంటి ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకున్నట్లైతే మీ బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది.. మతిమరుపు ఇలాంటి సమస్యలను చెక్ పెట్టవచ్చు..