కొందరికి దారుణ దురాలవాట్లు ఉంటాయి అయినా మానలేరు. విపరీతమైన డ్రింకింగ్ కొందరి బలహీనత రోజంతా సిగరెట్లు తాగడం మరికొందరి అలవాటు.

నానా చెత్త తినేసి కిడ్నీని పాడు పాడు చేసుకోవడం మరికొందరి పని. వీళ్లంతా రకరకాల మందులు ఎన్నెన్నో వాడుతారు. అయినా వ్యాధులు తగ్గవు దీనికి కారణం బలీయమైన ఆహార శైలి ఉండకపోవడం. ఈ బాధను తప్పించి బతుకునకు బలాన్ని ఇచ్చే బొప్పాయి అసలు రహస్యాలు బయటపడ్డాయి. తాజా పరిశోధనలో బొప్పాయి మహత్యం బయటపడింది.

బొప్పాయి పండ్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి ఎన్నో రోగాలను నయం చేసే గుణం వీటికి ఉంటుంది. మనం దగ్గరగా చూసే బొప్పాయి కాయల వల్ల, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు, తినేవారికి కూడా చాలా అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బొప్పాయి వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలి అంటే లివర్ సమస్యల నుండి బొప్పాయి రక్షిస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లేదా స్మోకింగ్ అధికంగా చేయడం వల్ల లివర్ చెడిపోతుంది. అలాగే ఊపిరితిత్తులు కూడా చెడిపోతాయి, లివర్ పూర్తిగా చెడిపోక ముందే గతి తప్పకుండా బొప్పాయి తీసుకోవాలి. ఇలా కనీసం రెండున్నర నుంచి మూడు నెలలు ఒక కప్పు బొప్పాయి ముక్కలు తినడం వల్ల, లివర్ సగం వరకు క్లీన్ అయినట్లే అని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే బొప్పాయి వల్ల మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటి అంటే ఎక్కువగా కిడ్నీలలో రాళ్లు తొలగిపోతాయి.

బొప్పాయిని తినడం వల్ల కిడ్నీలలో రాళ్లు కరిగిపోవడం లేదా బయటకు వెళ్లిపోవడం జరుగుతుందని, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతి రోజు క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే బొప్పాయిలో విటమిన్ ఏ బి సి ఈ విటమిన్లు మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. అందుబాటు రేటులో ఉండే ప్రత్యేకమైన ప్రభావితమైన ఫలం అంటే ఇదే అని కచ్చితంగా చెప్పవచ్చు, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో ఈ బొప్పాయి తినడం మంచిది. బొప్పాయిలో ఔషధ గుణాలు మరియు విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. వీటిని ఎక్కువగా రక్తకణాలు పడిపోయినా వారికి తినిపించేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో బొప్పాయి చెట్టు ఆకుల రసం తాగిస్తారు, అలాగే చర్మ సౌందర్యానికి కూడా దీనిని వాడుతారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ బొప్పాయిని తినడం అలవాటు చేసుకోవడం మంచిది.