బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, సి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. నెయ్యిలో విటమిన్ ఏ, కె, డి ల తో పాటు దేశీ నెయ్యిలో కొవ్వు అమ్లాలు ఉంటాయి.

బెల్లం నెయ్యి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. నెయ్యి బెల్లం కలిపి తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి.అలాగే శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి.

శరీరం జుట్టు చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. బెల్లంతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడుతుంది.

రోజు ఉదయాన్నే బెల్లం తీసుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయి. అలాగే నెయ్యి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆహారం రుచిని పెంచడమే కాకుండా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. నెయ్యి బెల్లం కలిపి తీసుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో నెయ్యి బెల్లం కలిపి తీసుకోవడం వలన శరీరం పిట్గా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తారు.

అయితే బెల్లం నెయ్యి కలిపి ఎప్పుడూ ఎంత పరిమాణంలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి ఒక స్పూన్ రెండు స్పూన్ల బెల్లం కలిపి తీసుకుంటే మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి. అయితే బెల్లం ఎక్కువ నెయ్యి తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ నెయ్యి ఎక్కువ.. బెల్లం తక్కువ తీసుకున్నట్లయితే మలబద్ధకం సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున తక్కువ పరిమాణంలో నెయ్యి ఎక్కువ పరమాణంలో బెల్లం ఉండేటట్లు చూసుకొని తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు..