దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఎదురయ్యే సమస్య కొత్త బియ్యం, పాత బియ్యం అని తేడాలేకుండా బియ్యం లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఎంతో ఖర్చు చేసి కొనుకున్న బియ్యం ఇలా కొన్ని రోజులుకి పురుగు పట్టింది అంటే చాలా బాధ కలుగుతుంది. ఇక ఈ బియ్యాన్ని వాడాలన్నా కష్టమే, ఎందుకంటే పురుగులు పట్టిన బియ్యం వండాలంటే అసలు మనసొప్పదు.

బియ్యం శుభ్రం చేసుకోవాలంటే మరీ కష్టం. పల్లెటూర్లో ఉండే వారైతే చాటతో చెరిగి లేదా ఎండ పెట్టి బియ్యం శుభ్రం చేసుకుంటారు, మరి ఉద్యోగాల్లో బిజీగా ఉండే నగరవాసులకు అంత తీరిక ఉండదు కదా, బియ్యం పురుగు పట్టకుండా ఒకవేళ బియ్యంలో పురుగులు ఉన్నా వాటిని సింపుల్గా తొలగించి మంచి టిప్స్ గురించి మనం తెలుసుకుందాం.

ఎండు మిరపకాయలు, మీరు బియ్యాన్ని ఎప్పుడైనా డబ్బాలలో పోసుకునే ముందు ఒక రెండు లేదా మూడు మిరపకాయలు బియ్యంలో ఉంచితే మీకు పురుగు అనేది పట్టదు, ఎందుకంటే ఈ మిరపకాయ నుండి వచ్చిన ఘాటైన వాసన కి పురుగులు అనేది దాదాపుగా పట్టవు. అలాగే సెకండ్ టిప్ ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు కానీ లేకుంటే వెల్లుల్లిపాయలు కానీ పొట్టు తీయకుండా బియ్యం లో ఉంచితే మీ బియ్యంలో పురుగులు అనేవి పట్టవు.

ఈ వెల్లుల్లి నుంచి వచ్చే ఘాటయిన వాసన వల్ల పురుగులు అనేవి పట్టవు. అలాగే మూడవ టిప్ వేపాకులు ఒకటి లేదా రెండు వేప ఆకులను తీసుకుని బియ్యంలో ఉంచినట్లయితే బియ్యంలో పురుగులు పట్టవు వేపాకులు కాకుండా రెమ్మలతో పెట్టినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా వేపాకు రెమ్మలని బియ్యంలో ఉంచినట్లయితే తెల్ల పురుగులు అలాగే ముక్కు పురుగులు కూడా బియ్యంలో చేరవు ఎందుకంటే, వేపాకు లో ఉండే క్రిమిసంహారక లక్షణాలు పురుగు పట్టకుండా చేస్తాయి. ఈ మూడు టిప్స్ మీకు బియ్యం లో పురుగు పట్టకుండా ఉండటానికి చాలా బాగా పనిచేస్తాయి. వీటితో పాటు మరొక టిప్ కూడా ఉంది, బియ్యం డబ్బాలు కానీ అలాగే పప్పు డబ్బాలు కానీ కొద్ది సేపు ఫ్రిజ్లో ఉంచినట్లయితే దాంట్లో ఉన్న పురుగులు చనిపోతాయి, కాకపోతే వీటిని శుభ్రం చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఇలా కాకుండా తెల్ల పురుగులు ముక్కు పురుగులు బియ్యం నుంచి వాటంతట అవే బయటికి పారిపోయేలా మరొక చిన్న టిప్ తెలుసుకుందాం. దీనికి మనకు కావాల్సింది 10 పచ్చి వేపాకు రెమ్మలు, ఈ వేపాకు రెమ్మలు నుంచి ఆకులను వేరు చేసి పెట్టుకోవాలి. దీనితో పాటు మనకు కావలసినది ఒక ఏడు లవంగాలు, 10 మిరియాలు, పది వెల్లుల్లి రెబ్బలు.

వీటన్నింటినీ మనము మిక్సీలో వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనికి అవసరం ఉంటే ఒక రెండు స్పూన్ల నీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మెత్తగా అయిన పేస్టు ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ చిన్న చిన్న ముద్దులనీ ఎండలో కానీ, లేదా ఫ్యాన్ కింద గాని గంట సేపు ఉంచినట్లయితే ఇది ఆరిపోయి గట్టిపడతాయి. సో ఇలా ఎండి, గట్టిగా అయినా బిళ్ళలని బియ్యపు డబ్బాలలో వేసి మూత పెట్టకూడదు. ఆరుబయట గానీ ఇంటి పైన గానీ ఉంచాలి. ఎందుకంటే ఈ బిళ్ళలు పెట్టిన తర్వాత డబ్బాలో నుంచి పురుగులు బయటికి వస్తాయి, సో అందుకనే బియ్యాన్ని మీరు ఇంట్లో కాకుండా బయట ఉంచితే పురుగులు బయటకు వెళ్తాయి లేదంటే ఇంట్లోనే ఉండి వేరొక పదార్థాలన్నీ అవి పాడు చేస్తాయి. ఇలా ఈ వేపాకు ముద్దులనీ బియ్యంలో కానీ లేదంటే గోధుమలలో కానీ గోధుమపిండిలో గానే ఉంచితే ఒక గంటలో పురుగులు అనేవి మాయమైపోతాయి. ఇది చాలా ఎఫెక్టివ్ టిప్స్. వేపాకు, లవంగాల, వెల్లుల్లి నుంచి వచ్చే ఘాటయిన వాసన వల్ల పురుగులు తొందరగా బయటికి వెళతాయి. ఈ ఉండలు పురుగు తో పాటు బియ్యంలో తేమ వల్ల ఏర్పడే బ్యాక్టీరియాను కూడా సంహరిస్తాయి. ఒక గంట తర్వాత వీటిని తీసేయొచ్చు లేదా అలా ఉంచుకున్న కూడా ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు.