టాలీవుడ్ చిత్ర పరిశ్రమ రూపు రేఖలను మార్చేసిన చిత్రం బాహుబలి, ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంత ఇంత కాదు, ప్రపంచం నలుమూలల మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి గర్వంగా మాట్లాడుకునేలా చెయ్యడమే కాకుండా ప్రభాస్ ని అన్ని బాషలలో తిరుగులేని స్టార్ ని చేసింది, ఒక్క తెలుగు లోనే కాకుండా హిందీ, కన్నడ మరియు మలయాళం బాషలలో ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి ఒక్క సినిమా కూడా బాహుబలి వసూళ్లకు దరిదాపుల్లో కూడా రాలేకపోయింది.

అంటే, ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ద్వారా ప్రభాస్ కి ఎంత పేరు వచ్చిందో, విలన్ గా చేసిన రానా కి, మరియు రాజా మాత శివగామి దేవిగా నటించిన రమ్య కృష్ణ కి కూడా అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతలు లభించాయి,ఒక్కే ఒక్క సినిమా తో రాజమౌళి మన తెలుగు సినిమాని శిఖరాగ్ర స్థాయిలో పెట్టాడు, బాహుబలి సృష్టించిన ప్రభంజనం చూసి ఇప్పుడు తెలుగు హీరోలు వరుసగా తమ సినిమాలను బాలీవుడ్ లో కూడా విడుదల చెయ్యడానికి ఆసక్తిని చూపుతున్నారు.

ఇక బాహుబలి సినిమా ద్వారా చిన్న ప్రభాస్ గా చేసిన నిఖిల్ దేవాదుల కి కూడా మంచి గుర్తింపు లభించింది అనే చెప్పాలి. బాహుబలి సినిమా లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మమతల తల్లి సాంగ్ లో నిఖిల్ దేవాదుల ప్రభాస్ చిన్నప్పటి పాత్ర లో నటించాడు, ఈ సినిమాకి ముందే ఈ పిల్లోడు పలు టాలీవుడ్ సినిమాలలో నటించిన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ని పొందింది మాత్రం బాహుబలి సినిమాతోనే, ఈ సినిమా తర్వాత ఆయనకీ టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా ఆఫర్ల వెల్లువ కురిసింది, కానీ ఈ పిల్లోడు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.

ఇది ఇలా ఉండగా త్వరలోనే నిఖిల్ హీరో గా వెండితెర కి పరిచయం అవబోతున్నట్టు సమాచారం, ఒక్క ప్రముఖ నిమరణ సంస్థ న్మిరించబోయ్యే సినిమాలో ఆయన హీరో గా నటించబోతున్నాడు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి, అయితే బాహుబలి సినిమా అప్పటికి, ఇప్పటికి నిఖిల్ లో వచ్చిన మార్పుని చూస్తే ఆశ్చర్యపోతారు, సన్నని మీసాలతో ఇతను ఇటీవల దిగిన ఫోటో షూట్ చూస్తే కచ్చితంగా హీరో మెటీరియల్ అనే అనుకుంటారు, ఆయన లేటెస్ట్ గా చేసిన ఫోటో షూట్ లోని కొన్ని ఫోటోలను ఎక్సక్లూసివ్ గా మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.