బీరువా లో అవి పెడుతున్నారా సర్వ*నాశనమే. మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది ప్రేమ అనుబంధాల తర్వాత డబ్బే, నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఈ డబ్బే అనుబంధాలను కూడా మించి పోతుంది. అలాంటి ధనంను నిల్వ చేసుకునే బీరువాను ఇంటిలో ఎటువైపు ఉంచాలి అంటే, ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ గది ఎటు ఉండాలో నిర్దేశించినట్లు బీరువా వంటి ముఖ్యమైన వస్తువులు ఏవి ఎక్కడ ఉండాలో మన పూర్వీకులు నిర్ణయించారు.

ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో అసలు బరువు ఉండకూడదని చెప్పినట్లే కొన్ని చోట్ల బరువు ఉంటే మంచిదని కూడా సూచించారు. ఆ ప్రకారంగా ఇంటిలో నైరుతి భాగంలోనే బరువును పెట్టాలని చాలా మంది భావిస్తూ ఉంటారు కానీ నిజానికి ఈ దిక్కున ఎలాంటి బరువు పెట్టకూడదు, మన జీవితంలో అతి ముఖ్యమైన బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే వాయువ్యం చంద్రునిది, చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి కనుక వాస్తు సూచనలను అనుసరించి డబ్బు నగలు భద్రపరచుకునే బీరువా ఉత్తర వాయువ్యంలో అనగా పశ్చిమానికి ఉత్తరానికి మధ్య ఉండే మూలలో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే ఈ బీరువాను దక్షిణ దిక్కున చేసి పెట్టిన కూడా శ్రేష్ఠ కాని బీరువా తెరచినప్పుడు మన ముఖం ఉత్తరం వైపు చూస్తూ ఉండే లా చూసుకోవాలి.

ఈ సూచనలను పాటించినట్లయితే మన జీవితంలో ధననష్టం జరగకపోవడమే కాదు ఊహించని ధనం ఇంట్లోకి వచ్చి చేరుతుంది. బీరువాను ఉత్తర దిక్కు మధ్య ఉంచినా కూడా మంచిదట ఎందుకంటే ఉత్తరదిక్కు కుజుడు అధిపతి బుధుడు సంపదలకు అధిపతి కనుక బీరువాను ఉత్తర దిక్కు మధ్యభాగంలో ఉంచినా కూడా మంచిదే, కానీ బీరువా మాత్రం దక్షిణ ముఖమే చూస్తూ ఉండాలి.