బఠానీలు పటపటమని కొరుక్కుతుంటే ఆ కిక్కే వేరు. ఇక ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్ కావాల్సినంత ఉంటుంది. తెల్ల బఠానీలు తింటే శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

ఇది గ్లూకోజ్ స్థాయిలను స్వీకరించడానికి కూడా దోహదం చేస్తాయి. బరువు నిర్వహణలో కీలక పాత్ర పోషించే బఠానీలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే బఠానీలలో విటమిన్ బి ఉంటుంది. ఎముకలు, దంతాలను పటిష్టం చేయడంలో ఈ బఠానీలు ఎంతో మేలు చేస్తాయి.

ఇవి కండరాల నిర్మాణం, హార్మోన్ల ఉత్పత్తితో సహా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. బఠానీలు తినడం వలన మజిల్ టిష్యూస్ ప్రిపేర్ అవ్వడానికి మరియు రీ బిల్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి.ఠానీలు కనుక తీసుకుంటే చాలా సహాయపడుతుంది.

ఎప్పుడైతే మజిల్ టిష్యూస్ చిరిగిపోతాయో బఠానీలలో ఉండే ప్రోటీన్ వెంటనే ఎమినో యాసిడ్స్ ను అందిస్తుంది. దీంతో మజిల్ టిష్యూస్ మెరుగుపడతాయి. అలాగే పచ్చి బఠానీలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చి బఠానీలు తీసుకుంటే అలసిపోయినట్లు అనిపించదు. పైగా దీనిలో ఎక్కువ శాతం ప్రోటీన్ తో పాటు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది.

ఎటువంటి డైట్ ప్లాన్ లో అయినా బఠానీలను తీసుకోవచ్చు. దీనిలో ఎటువంటి పదార్థాలు ఎలర్జీలకు గురి చేయవు. బఠానీల వలన కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. దాంతో గుండెకు సంబంధించిన జబ్బు లు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇక కిడ్నీల ఆరోగ్యానికి కూడా బఠానీలు ఉపయోగపడతాయి.