ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోధ్య సందడే కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల పాటుగా ఎదురు చూస్తున్న హిందువుల కళ, ఈ నెల 22న తీరని ఉంది. అయోధ్యలో శ్రీరామాలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ఈనెల 22న జరగనుంది.

ఇక ఈ వేడుకకి సుమారు 7000 మంది అతిధులు హాజరుకానున్నారు. వీరిలో దాదాపు 3,000 మంది వివిఐపీ లు కూడా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముందుగా అయోధ్యలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అందులో జటాయువు అయోధ్యకు రాయడం. జటాయువు అనేది ఒక పక్షి, ఇక ఈ జటాయు పక్షి గురించి రామాయణం విన్న వారందరికీ తెలిసే ఉంటుంది.

రామాయణంలో అరణ్యకాండలో జటాయు యొక్క పాత్ర ఉంటుంది. ఎప్పుడైతే రావణుడు సీతమ్మవారిని ఎత్తుకొని వెళ్తూ ఉండగా, అప్పుడు జటాయువు సీతమ్మను కాపాడడం కోసం, రావణుడిపై దాడి చేస్తుంది. ఇక తిరిగి రావణుడు జటాయువు మీద దాడి చేయడంతో ఆ సమయంలో జటాయువు రెక్కలు పోగొట్టుకుంటుంది. ఆ తర్వాత రాముడికి సీత అపహరణ గురించి చెప్పి ప్రాణాలు వదిలేస్తుంది జటాయువు. అలా రామాలయంలో జటాయువుది చాలా పెద్ద ప్రాత్ర అని చెప్పాలి.

ఆ జటాయు పక్షులు చాలా వరకు అంతరించడానికి దగ్గరలో ఉండగా, అంతలోనే అయోధ్యలో అద్భుతం చేసింది. అదేంటంటే అయోధ్యలో రాముల వారి ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా, రాబందుల గుంపు భారీ సంఖ్యలో అయోధ్యకు చేరుకొని అందరిని ఆశ్చర్యపరిచాయి. దీంతో రాబందుల రాజైన జటాయువు ను తీసుకొని వచ్చారని రామభక్తులు అంటున్నారు. నిజానికి ఇది చాలా అద్భుతమైన ఘటన అని అంటున్నారు. సీతమ్మ అపహరణ గురించి రాములవారికి జాడ చెప్పి ప్రాణాలు వదిలిన జటాయువు,

ఈరోజు అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్టకు వచ్చాయని, అసలు రాబందులే అంతరించిపోతున్న సమయంలో ఇన్ని రాబందులు రావడం మాత్రం రాములవారి మహిమే అని అనుకుంటున్నారు. ఇక ఇన్ని రాబందులు రావడంతో అయోధ్యకి అన్ని మంచి రోజులే రాబోతున్నాయని అనుకుంటున్నారు భక్తులు. మొత్తానికి ఇది మాత్రం అందరిని సంతోష పెడుతున్న అద్భుతం అని చెప్పాలి. ఇక ఈ విషయం అంతటా పాకటంతో, ఈ అద్భుతం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మాట్లాడారని తెలిసింది. ఇది స్వయంగా రాముల వారి మహిమేనని చెప్పాలి. జైశ్రీరామ్….

https://youtu.be/k05R0iappPE