ఒకటే ప్రదేశంలో గంటల తరబడి కూర్చుని పనిచేసే వారిలోనే పైల్స్ అధికంగా వస్తుంది. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు.

నీళ్లు అధికంగా తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గి పైల్స్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. అంజీర పండును రాత్రిపూట నీళ్లల్లో నానబెట్టాలి. ఉదయం లేచి పరగడుపున అంజీర తింటే పైల్స్ సమస్య దూరమవుతుంది. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం తగ్గించండి.

మూడు గంటల వ్యవధిలో కనీసం రెండుసార్లు లేచి ఓ 5 నిమిషాల పాటు అటుఇటు తిరగడం మంచిది.నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి తగ్గి ఫైల్స్ బారిన పడకుండా ఉంటాం. బీన్స్, సోయా బీన్స్, పీచు అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే పైల్స్ ప్రారంభ దశలో ఉంటే తగ్గిపోతుంది.

మలం వచ్చే భాగంలో మీకు కొన్ని రోజులపాటు మంట, ఉబ్బెత్తుగా ఉన్నట్లుగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. ప్యాకింగ్ వస్తువులకు బదులుగా, తాజా ఆకుకూరలు, కూరగాయలు తినేవారికి పైల్స్ సమస్య రానే రాదు. తీవ్రమైన ఒత్తిడి, వేళాపాళా లేని పనివేళలు, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారికి మూలశంక వ్యాధి వచ్చే అవకాశం అధికం.

వీరు జాగ్రత్తగా ఉండాలి. చిరు తిళ్లు, ఫాస్ట్ ఫుడ్ లాంటి బయట దొరికే తిండి తింటే శరీరంలో వేడి అధికమై పైల్స్ వచ్చే అవకాశం ఉంది. వీటిని తగ్గించడం బెటర్. ఉదయం, రాత్రి గోరు వెచ్చని పాలు తాగి అర్షకల్ప్ ఒక్క ట్యాబ్లెట్ పది రోజుల నుంచి రెండు వారాల పాటు వేసుకుంటే పైల్స్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నవారికి నయమవుతుంది. అయితే ఫ్యామిలీ డాక్టర్లను సంప్రదించి ట్యాబ్లెట్లు వాడటం ఆరోగ్యానికి శ్రేయస్కరం.