మన దేశం లో సోను సూద్ లాంటి మహనీయుడు ఇంకొకరు లేరు అని చెప్పడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు, కష్టం వస్తే సొంత అన్న తమ్ముళ్లు కూడా సహాయం చెయ్యని మనుషులు ఉన్న ఈ రోజుల్లో, కష్టం వస్తే నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చి ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయం లో ఆయన చేస్తున్న సహాయాలు గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది, ఆయన కొంతమంది సినీ నటులు మరియు రాజకీయ నాయకులూ లాగ వందల కోట్లు వేళా కోట్లు ఆస్తులు కలిగిన వాడు కాదు, ఆలా అని కోట్ల రూపాయలకు పడగలెత్తిన వ్యాపారవేత్త వారసుడు కాదు, ఒక్క ప్రముఖ నటుడు అంతే, కానీ ఆయన తానూ సంపాదించిన సంపాదన లో చేస్తున్న సహాయాలు కోట్లకి పడగలెత్తిన ఎంతో మంది సినీ నటులు మరియు రాజకీయ నాయకులకు స్ఫూర్తిని ఇచేలా చేస్తోంది, ఇలాంటి ఉదారస్వభావం కలిగిన మహనీయుడు మన దేశం లో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి.

ఈ కరోనా మహమ్మారి సమయం లో లాక్ డౌన్ కారణంగా సోను సూద్ కి ఆదాయం తెచ్చి పెట్టె సినీ ఇండస్ట్రీ కూడా మూత పడింది, కానీ సోను సూద్ తానూ కస్టపడి సంపాదించిన సొమ్ము తో ఎంతో ఇష్టపడి కట్టుకున్న 8 అంతస్థుల ఇల్లుని తాకట్టు పెట్టి పేదలకు సహాయం చేసాడు అనే విషయం మీకు ఎవ్వరికైనా తెలుసా?, ఈ కాలం లో మన చుట్టూ పక్కన ఉండే స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి పనులు చెయ్యడానికి సంకోచిస్తారు, కానీ పేదలకు సహాయం చెయ్యడమే జీవిత లక్ష్యం గా సోను సూద్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది,తన పేరు మీద ఉన్న ఇంటిని తాకట్టు పెట్టడమే కాకుండా తన భార్య పేరు మీద ఉన్న ఆరు ఫ్లాట్స్ మరియు రెండు షాప్స్ ని కూడా తాకట్టు పెట్టి పేదలకు సహాయం చేసాడు సోను సూద్,ఇలాంటి మహనీయుడు గురించి ఏమి చెప్పగలం, ఇతనిని చూసి ప్రతిగీ ఒక్క భారత పౌరుడు స్ఫూర్తిగా తీసుకొని తానూ సంపాదించే దాంట్లో ఆకలి తో అలమటిస్తున్న వారికి సహాయం చేస్తే ఈ దేశం లో ఆకలి చావు అనేది ఉండదు.

సోను సూద్ కి ప్రతి రోజు ట్విట్టర్ ద్వారా మరియు ఇంస్టాగ్రామ్ ద్వారా వందల్లో వేళల్లో జనాలు తమకి సహాయం చెయ్యాలి అని మెసేజ్ లు పంపుతున్నారు అని ఆయన అనేక సందర్భాలలో తెలిపాడు, నిన్న తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా రోజు ఆకలి బాధతో నాకు వందలాది మంది సహాయాల కోసం మెసేజ్ చేస్తున్నారు అని,అందరి సహాయాలు తీర్చేది నా ఒక్కడి వల్లే అయ్యే పని కాదు అని,మీరందరు కూడా ఒక్కో చెయ్యి వేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అని సోను సూద్ పిలుపుని ఇచ్చాడు, ఆయన ఒక్కరికి సహాయం చేయడం కోసం ఎలాంటి ఫండ్ రైసింగ్ కార్యక్రమాలు చెయ్యలేదు, కేవలం తానూ రేయింబవళ్ళు కస్టపడి శ్రమించిన డబ్బునే ఖర్చుపెడుతున్నాడు, ఎలాంటి రాజకీయ ప్రయోజనం కూడా అతను చూసుకోవడం లేదు, ఇంత నిస్వార్ధపరుడు రాజకీయ పార్టీ పెడితే ఎవ్వరైనా ఓటు వెయ్యకుండా ఉండగలరా ?? , కానీ సోను సూద్ కి అలాంటి ఉద్దేశాలు కూడా ఏమి లేవు, ఇంత నిస్వార్థం సమాజ సేవ చేస్తున్న సోను సూద్ కి మన ఇండియన్ గవర్నమెంట్ భారత రత్న పురస్కారం ఇచ్చిన అది తక్కువే అవుతుంది.