ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కుటుంబ సభ్యులు వివాహ వేడుకల్లో మునిగిపోయారు. షర్మిల తనయుడు వైయస్ రాజారెడ్డి వివాహం ప్రియ అట్లూరితో,

ఫిబ్రవరి 15న సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు రాజస్థాన్లోని జోధ్పూర్ లో ఉన్న ప్యాలెస్ లో గ్రాండ్గా జరిగింది. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. ఇక మరుసటి రోజు అనగా 18వ తేదీ క్రిస్టియన్స్ సాంప్రదాయ పద్ధతిలో, మరోసారి వేరే పెళ్లి ఘనంగా జరిగింది.

ఇక పెళ్లి కోసం వైఎస్ షర్మిల కుటుంబం రెండు రోజుల ముందుగానే జోధ్పూర్ ప్యాలెస్ కి బయలుదేరింది. అలా ఫిబ్రవరి 15న సంగీత్ మెహేంది పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకలకు సంబంధించిన ఫోటోలని షర్మిల తన ట్విట్టర్లో పంచుకుంది. అయితే షర్మిల సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని, ఆయన సతీమణి వైయస్ భారతి గాని వివాహ వేడుకకు హాజరు కాలేదు కానీ,

అంతకుముందు హైదరాబాదులో జరిగిన మేనల్లుడు ఎంగేజ్మెంట్ కి సతీసమేతంగా హాజరయ్యారు. జగన్ అయితే ఆ సమయంలో షర్మిల అతనికి ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రచారం జరిగింది. దీంతో జగన్ అవమానంగా ఫీల్ అవ్వడంతో ఇప్పుడు పెళ్లికి కూడా రాలేదు అని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ విషయం గురించి జగన్ సతీమణి భారతి కూడా స్పందించిందని తెలిసింది తమను ఎంగేజ్మెంట్కు పిలిచి అందరిముందు అవమానించారు అని,

అలాంటిదే పెళ్లికి వెళ్తే ఇంకెంత అవమానం జరుగుతుందో అని పెళ్లికి వెళ్లలేదు అని అన్నట్లు తెలిసింది. అయితే ఇందులో ఎంత నిజము ఉందో తెలియదు కానీ జగన్ ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ కి వెళ్లి పెళ్లికి వెళ్లక పోయేసరికి అందరూ ఇదే ప్రధాన కారణమని అనుకుంటున్నారు. మరి జగన్ ఈ విషయం గురించి ఏమని స్పందిస్తాడో చూడాలి. ఇక మరో పక్క షర్మిల ఇంటికి కోడలు రావడంతో వివాహ వేడుక వేడుకని ఫోటోలో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది షర్మిల.

https://youtu.be/0E6kwntl0GY

పెళ్లి ఘనంగా జరగడంతో అంత పెద్ద వేడుకలో జగన్ లేరు అని ఆయన అభిమానులు బాధపడుతున్నారు. ఇక మరి కొంతమంది వాళ్లకు ఇవన్నీ మామూలే అని, మళ్ళీ వాళ్లే కలిసిపోతారని అంటున్నారు. మరోపక్క మేనల్లుడికి వైయస్ భారతి గిఫ్ట్ పంపించింది అని తెలుస్తుంది. జగన్ ఫ్యామిలీ మేనల్లుడు పెళ్లికి వెళ్లకున్న కూడా నవ దంపతులకు బంగారు చైన్స్ గిఫ్ట్స్ పంపించారని, దీంతో షర్మిల తన అన్న వదిన పెళ్లికి రాకపోయినా గిఫ్ట్స్ పంపారని సంతోషపడిందని తెలిసింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ అవుతుంది.