వైట్ కాలర్ మోసాలు చేసే వారిలో కేవలం మగవారు మాత్రమే ఉంటారు అనుకుంటే, మీరు పొరపాటు పడినట్లే ఆడవారిలో కూడా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అధికారులు సెలబ్రిటీలు, పొలిటిషన్ పేరుతో చలామనీ అవుతున్నారు.

తాజాగా సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అలాంటి ఒక కథనాక్ లేడీ ని అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన మాళవిక అనే ఒక యువతి, తాను సికింద్రాబాద్ ఆర్పి ఎఫ్ ఎస్ ఐ ని అంటూ అందరినీ నమ్మించి, పోలీస్ అధికారినిగా చలామణి అవుతుంది. వంటిపై కాకి డ్రెస్ వేసుకొని రియల్ పోలీస్ అవతారం ఎత్తింది.

ఈ ఫేక్ పోలీస్ ఆఫీసర్ ఈ ఫేక్ లేడీ పోలీస్ శంకర్ పల్లి లో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించిన మాళవిక, నార్కెట్పల్లి లో ఎస్సైగా చలామణి అవుతూ, రియల్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతుండగా, నలగొండ జిల్లా పోలీసులు ఎట్టకేలకు ఆమెను పట్టుకున్నారు. మాళవిక నిజంగా సికింద్రాబాద్ ఎస్ఐ కాదని విషయం ఆమె పెళ్లి సంబంధం చూసేందుకు, యూనిఫాంలో వెళ్లడంతో అబ్బాయి తరపు బంధువులకు అనుమానం వచ్చింది.

దాంతో ఆమె వివరాలు సేకరించేందుకు ఆరా తీయడంతో, అసలు విషయం ఇలా బయటపడింది. ఎస్ఐ అని చెప్పుకుంటున్న మాళవిక నిజం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది, 2018 లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరిధిలో పరీక్ష రాసింది. అయితే ఫిజికల్ గా టెస్ట్ లో భాగంగా ఆమెకు కంటి సమస్య ఉండడంతో, వైద్య పరీక్షల్లో ఆమె క్వాలిఫై కాలేదు, జాబ్ కి క్వాలిఫై కాలేకపోయినప్పటికీ కూడా మాళవిక ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెప్పుకొని, యూనిఫామ్ ఐడి కార్డ్ ని తయారు చేసుకుంది.

వాటితోనే రియల్ పోలీస్గా చలామణి అవుతూ వచ్చింది. అయితే పెళ్లి సంబంధం కోసం అబ్బాయి తరఫు వాళ్ళు పై అధికారులను సంప్రదించడంతో, మోసం ఈ విధంగా బయటపడింది. పోలీస్ యూనిఫామ్ వేసుకొని పెళ్లి చూపులకు వెళ్లడం మే కాదు, అదే గెటప్ లో చాలా రీల్స్ కూడా చేసి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే తాను చేసిన మోసాన్ని పోలీసులకు పట్టుబడిన తర్వాత చాలా తెలివిగా సమర్థి ంచుకుంటుంది మాళవిక. జాబ్ రాలేదని తన తల్లిదండ్రులు బాధపడడంతో ఇటువంటి పని చేయాల్సి వచ్చిందని, పోలీసులు విచారణలో తెలిపింది. తప్పు చేయాలంటేనే పోలీసులు చూసే భయపడతారు అలాంటిది ఒక యువతి ఏకంగా పోలీస్ నట్టు, యూనిఫామ్ ఒంటి మీద వేసుకొని నకిలీ అధికారినిగా చలామణి అయ్యింది. అయితే దీనిపై డిపార్ట్మెంట్ కి చెందిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు చూడాల్సింది.