ఈరోజు షాంపూలకు చుండ్రు ఎందుకు పోదు మనం తెలుసుకుందాం.. చుండ్రు అనేది ఒక అతిపెద్ద సమస్యగా మారింది. నూటికి ౮౦% మందికి పైన ఇబ్బంది పెట్టే పెద్ద సమస్య ఇది. ఏ షాంపూ వాడితే బాగుంటుందని చాలా మంది షాంపూలు మారుస్తూ, చుండ్రు కి ట్రీట్మెంట్ నీ అందిస్తూ ఉంటారు. కొంతమంది చుండ్రు కోసం కూడా డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. వాళ్లకు కొన్ని యాంటీ బ్యాక్టీరియల్ కి సంబంధించిన మందులు, లోషన్స్ ఇస్తూ ఉంటారు. షాంపూ లలో చూస్తే ఆ బ్యాక్టీరియాలను నివారించడానికి సంబంధించిన షాంపూలు ఉంటూ ఉంటే వాడుతూ ఉంటారు. ఈ షాంపూ లో కొంతకాలం వాడే సరికి చుండ్రు కొంత తగ్గదు, మళ్ళీ ఇంకొక బ్రాండ్ షాంపూ టివి ల్లోచూసి మారుస్తూ ఉంటారు. ఇలా షాంపూల కి అసలు చుండ్రు ఎందుకు పోదు?

మామూలుగా మనకి తల స్నానం చేసినప్పుడు ఈ షాంపు, ఆ షాంపు అని లేకుండా ఏ షాంపూ చేసిన లేకపోతే కుంకుడుకాయ పెట్టి చేసిన తల లో ఉన్న ఆ క్రిములు, ఆ వ్యర్ధాలు అన్ని శుభ్రం అవుతాయి. తలలో ఉన్న వ్యర్థాలు శుభ్రమై పోతుంది కాబట్టి చుండ్రు తగ్గుతుంది. దురదలు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గిపోతుంది. రెండ్రోజులు షాంపూతో స్నానం చేయండి, అసలు ఏమీ ఉండదు. షాంపు అనేది చుండ్రుని మళ్ళీ రాకుండా కాపలాకాయడు కదా, మళ్లీ చుండ్రు వచ్చేటట్టు మనం చేస్తున్నాం. ఉన్న చుండ్రుకి ఈ షాంపు, ఆ షాంపు అనక్కర్లే. యాంటీ డాండ్రఫ్ షాంపూ అన్న పేరేమి ఉండనవసరం లేదు. మీరు ఏ షాంపూ వాడిన శీకాకాయ, వాడిన కుంకుడు కాయ వాడిన మీ తలలో ఉండే వ్యర్ధాలు, టాక్సిన్స్, డెడ్ సెల్స్ అన్నీ నిల్వ ఉండడం వల్ల అందులో చేరిన బ్యాక్టీరియాలు శుద్ధి అవుతాయి. కాబట్టి మీకు వెంటనే వన్, టు డేస్ లో రిలీఫ్ ఉంటుంది.

మళ్లీ చుండ్రు వచ్చేటట్లు షాంపు ఎందుకు ఆపదు. అంటే కారణం ఏమిటి మీరు ఒకసారి తలస్నానం చేశారు అనుకోండి, మళ్ల షాంపూ పెట్టి తలస్నానం చేయడానికి ఎన్ని రోజులు? ఎక్కువమంది వారానికి ఒకసారి చేస్తారు. కొద్ది మంది అమ్మాయిలు ఏదైనా ఫంక్షన్స్ అలాంటి ఉన్నప్పుడు వీక్లీ రెండు సార్లు. ఎందుకంటే ఎక్కువసార్లు తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోతుందని, జుట్టు చిక్కులు పడితే, తీసుకోవడం జుట్టు ఆరడం ఇవన్నీ సమయాభావాలు, కొంచెం ఇబ్బందుల వల్ల చాలా మంది వారానికి ఒకసారి, వారానికి రెండు సార్లు. ఇంకొంత మంది జలుబు చేస్తుందని, జుట్టు ఎక్కువ ఊడిపోతుందని, పది, పదిహేను రోజులకు ఒకసారి, తలస్నానం చేస్తూ ఉంటారు. చుండ్రు కి షాంపు అనేది ఉన్న దాన్ని క్లీన్ చేయడానికే తప్ప, లేని చుండ్రు భవిష్యత్తులో మళ్లీ రాకుండా నివారించే మెకానిజం షాంపూల్లో ఉండదు.

మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి.