వైష్ణవి.. జీతంలో తాను ఎదుర్కున్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది. చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలు చేపట్టిన వైష్ణవి పూట గడవడం కోసం రాత్రుళ్ళు బర్త్ డే పార్టీస్, పెళ్లి ఈవెంట్స్ లో డాన్స్ చేసేదాన్నని తెలిపింది.

బర్త్ డే పార్టీలో డాన్స్ చేస్తే 700 రూపాయలు ఇచ్చేవారని.. ఆ డబ్బుతో అమ్మ మా కడుపునింపేది. యూట్యూబ్ వీడియోలు చేసే సమయంలో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సెపెరేట్ రూమ్ ఉండేది కాదు .. బాత్ రూమ్ లోనే బట్టలు మార్చుకునేదాన్నని చెప్పుకొచ్చింది.

ఒక సినిమాలో చిన్న పాత్ర చేస్తున్న సమయంలో వాష్ రూమ్ కోసం క్యారవాన్ యూజ్ చేసుకోవాలని అడిగితే..తనను చాలా మాటలు అన్నారని ఎమోషనల్ అయ్యింది వైష్ణవి. ఇవన్నీ చూసి అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. వైష్ణవి ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

బేబీ తర్వాత ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి.. ప్రస్తుతం 3 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అందులో ఆశిష్ హీరోగా నటిస్తున్న ‘లవ్ మీ’ సినిమా ఒకటి. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు మేకర్స్. త్వరలోనే ఈసినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నట్లు సమాచారం.