పాకిస్తాన్ సైన్యం నుంచి తప్పించుకుని భారత్కు చేరుకున్నాడు ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్. ఆయన కథ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, ఇది 1965 నాటి సంగతి భారత్లోని పటాన్ కోట హల్వార్ అదంపూర్, వైమానిక స్థావరాలు పై దాడి చేయడానికి పాకిస్తాన్ వైమానిక దళం సి 130 హెర్క్లాస్ విమానం ద్వారా, 180మందిని పారాట్యుపర్లను కానీ ఇందులో చాలా మందినీ భారత సైన్యం పట్టుకుంది. ఇదంతా సెప్టెంబర్ ఆరో తేదీ రాత్రి పూట జరిగింది.

వీరిలో 22 మంది చనిపోగా మిగిలిన వారు పాకిస్తాన్ కి తిరిగి వెళ్ళిపోగలిగారు. అదే సమయంలో పాకిస్తాన్ కి చెందిన రెండు కానా బెర్ర విమానాలు భారత్ లోని అదంపూర్ వైమానిక దాడి చేశాయి. అయితే అక్కడ మొహరించిన యాంటీ airkraft గన్లు ఒక విమానాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరపడంతో అది సరిగ్గా ఎయిర్ బేస్కో అవుతల పడిపోయింది.

ఆ ఫైటర్ విమానానికి చెందిన పైలట్ నావిగేటర్లను అదుపులోకి తీసుకొని వారిని అదంపూర్ ఎయిర్ బేస్ లోని ఆఫీసర్ నెస్కు తరలించారు. జెనీవా ఒప్పందం ప్రకారం వారిని బాగా చూసుకున్నారు కూడా. వారి కోరిక మేరకు ఒక పంజాబీ దాబా నుంచి తందూరీ చికెన్ బటర్ నానుకూడా తెప్పించారు. మరుసటి రోజు ఈ యుద్ధ ఖైదీలను ఆర్మీకి అప్పగించారు భారత సైనికుల లక్ష్యం లాహోర్ను స్వాధీనం చేసుకోవడం కానీ, 1950లోనే నిర్మించిన ఇచ్చేగల కాలువ భారత సైన్యం ముందుకు సాగడంలో ఒక ప్రధాన అద్దంకిగా మారిందట..

ఆ కాలువ వెనకనుంచి భారతీయ సైనికుల మీద 1.55 ఎంఎం హెవీ పిరంగులతో నిరంతరం కాల్పులు జరిగేవి.చివరకు ఈ మోత నుంచి విముక్తి పొందినందుకు భారతీయ వాయుసేన సహాయాన్ని తీసుకోవాలని భారత సైన్యం నిర్ణయించుకుంది. పారాషూట్లతో చెరకు తోటలోకి దూకి చినాయి విమానంలో 2*68ఎంఎం రాకెట్లు పాడ్లు ఉన్నాయి. ఇంధనం ట్యాంకులు మూడో వంతు ఇంధనం ఉంది అలాంటి పరిస్థితుల్లో 2000 అడుగుల ఎత్తు నుంచి విమానం కింద పడిపోతే, ఆయన చనిపోవడం ఖాయం. సెకండ్ కాలం కూడా ఆయన ఆలస్యం చేయకుండా చిణాయి వెంటనే ఇంజక్షన్ బటన్ నొక్కారట.

నేను కిందకు వస్తున్నప్పుడు నాకు రైఫిల్ బుల్లెట్ శబ్దాలు వినిపించాయని కూడా చెప్పారు. మధ్య మధ్యలో నుంచి పిరంగుల నుంచి వచ్చే గుండ్లు కూడా కనిపించాయట. చాలా బుల్లెట్లు ఆయన పారాషూట్ ని తగిలి వెళ్లిపోయాయట. వారు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు అని అప్పుడు ఆయనకు అర్థమైందని, ఇటీవల రాసిన ఒక పుస్తకంలో రాసుకొచ్చారు.

ఇది జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఎందుకంటే విమానాన్ని కూల్చేసిన తర్వాత పైలెట్ కు ప్రాణాలతో బయటపటానికి పారాచూట్ మాత్రం ఒక్కటే మార్గము. అదృష్టవశాత్తు ఆయన చెరుకు తోటలో పడ్డారట, చెరకు ఎదిగి ఉండడంతో ఆయనకు దాక్కునేందుకు మంచి చోటు దొరికినట్లు అయింది కింద పడిపోయిన వెంటనే సైనికుల అరుపులు బుల్లెట్ల శబ్దాలు ఆయన విన్నారట, ఇక గుంత తవ్వి మ్యాప్ ని దాచి చెరుకు తోటలో జింక తరహాలో జిగ్ జాగ్ స్టైల్లో చినాయి పరిగెత్తడం మొదలు పెట్టారట. భయం కారణంగా ఆయన మరింత వేగంగా పరిగెత్తాడట. భారత సరిహద్దు తూర్పున ఉండటంతో తాను తూర్పు వైపు పరిగెత్తే అవకాశం ఉందని పాకిస్తాన్ సైనికులు అంచనా వేస్తారని ఊహించి, పడమర వైపు పరిగెత్తడం మొదలు పెట్టారట.

క్రమంగా వాహనాల శబ్దాలు సైనికుల అరుపులు ఆగిపోయాయి. అయినప్పటికీ చెరుకు తోటలో దాక్కుంటూ పరిగెత్తడం మాత్రం ఆయన ఆపలేదు కాసేపటి తర్వాత ఉత్తరం వైపు వెళ్లడం మొదలుపెట్టారట, రెండు గంటలపాటు వేగంగా పరిగెత్తడంతో ఆయాసం వచ్చి ముందుకు కథల లేకపోయి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. దీంతో తోటలోనే కాసేపు ఆగి విశ్రాంతి తీసుకున్న కాస్త కూడా కదలకుండా ఉండేందుకు ఆయన శక్తి మేర ప్రయత్నించారట. ఒకవేళ పాకిస్తాన్ సైనికులకు దొరికిపోతే వారు ఆయన పట్ల ఎంత దారుణంగా ప్రవస్తారో ఆయనకి తెలిసిన విషయమే, త్వరగా చీకటి పడాలని ప్రార్థించడం మొదలు పెట్టారట చీకటి పడగానే ఒక గుంత తవ్వి ఆయన దగ్గర ఉన్న మ్యాపు రాడార్ అతంటికేషన్ షీట్ లాంటి శత్రువుకి అనుకూలించే వస్తువులను అందులో దాచి పెట్టేసారట. మొహం మీద మొత్తం బురద రుద్దుకున్నారట జి సూట్ మొత్తం చెమటకు తడిసిపోయిందట బురద చెమట తడితో ఆయన నల్లగా మారిపోయారట ఈ విషయాలన్నీ చినాయి ఆయన రాసిన బుక్కులో రాసుకు వచ్చారు.

ఇక అక్కడ నుంచి ఎలాగోలాగా బయటపడిన తర్వాత భారత సైన్యం దగ్గరికి రాగానే ఆయనను గుర్తుపట్టలేక హాండ్స్ అప్ నేను అమృత్సర్ బాటాల రహదారికి వచ్చిన వెంటనే భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు దాటినట్టు అనిపించిందట, ఒక గ్రామం బయట బావి కనిపించడంతో అక్కడికి పరిగెత్తి బకెట్లో నీళ్లు తోడుకొని మరిన్ని నీళ్లు తాగారట, ఆ తర్వాత నెత్తిమీద కూడా నీళ్లు పోసుకుని దాహం తీరిన తర్వాత ఆయనలో ఆత్మవిశ్వాసం వచ్చిందని చెప్పుకు వచ్చారు. అమృత్సర్ బాటాల మార్గంలో దక్షిణం వైపు నడవడం ప్రారంభించారు. ప్రధాన రహదారిని వదిలేసి పక్క దారి నుంచి నడక సాగించారు ఉదయం అయిందట అక్కడ తనకి తమిళం మాట్లాడుతున్న కొందరి గొంతు వినిపించడంతో హమ్మయ్య అనుకున్నారట, ఆ మాటలు విన్న వెంటనే నేను ఎవరు ఎక్కడా అని అరిచాను అప్పటికే ఆ డ్రెస్సు బురదతో నిండిపోయి ఉండడం, చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారట అందులో ఉన్న ఒక వ్యక్తి ఆయనపై తుపాకీ గురి పెట్టి హాండ్స్ అప్ అన్నారట. ఆయన మోకాళ్లపై కూర్చుని చేతిలో పైకెత్తి నేను చినాయి అని వెల్లడించారట, ఆ తర్వాత అక్కడ ఉన్న ఆఫీసర్స్ కి చీనాయి తెలియటం, ఆయనని హాస్పిటల్ కి తీసుకు వెళ్లడం ఆ తర్వాత చికిత్స అందించడం, తర్వాత ఆయన కోల్పోవడం తర్వాత ఇన్ని రోజులకి ఆయన ఒక పుస్తకం రాసి ఆ పుస్తకంలో ఈ విషయాలు వెల్లడించడంతో, ఇప్పుడు వీటి పై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది…