మొలలు (పైల్స్) అంటే ఏమిటి వాటి యొక్క నివారణ :– మలవిసర్జన కష్టతరమయిన , మాములుగా కాకా తక్కువ సార్లు మల విసర్జన జరుగుతున్నా దానిని ;మలబద్దకం గా పరిగణిచాలి .

ఈ విధంగా వున్నపుడు , మలవిసర్జన ప్రక్రియ కష్టతరంగా ఉంటుంది . ఇటువంటి పరిస్థితుల్లో మలవిసర్జన చేసినపుడు , మలద్వారానికి పయిన పురీషనాళం చివరన వాచిపోయిన రక్తనాళాలు ను ”మొలలు ”అంటారు .

ప్రధాన కారణాలు:– మొలలు ఏర్పడడానికి మలబద్దకం సాఫీగా లేకపోవడం వల్ల ఈసమస్య కు దారి తీస్తుంది కొందరిలో మల ద్వారం దగ్గర వుండే సిరలు బలహీనంగా ఉండటం వలన కూడా మొలలు వస్తాయి ఇవే కాకుండా ఆహారపు అలవాట్లు , పీచుపదార్ధాలు తక్కువుగా వున్న ఆహారం ను తీసుకోవడం వలన పైల్స్ వచ్చే అవకాశాలు వున్నాయి . మలద్వారం వద్ద రక్తం పడుతుంది మరియు దురద ఉంటుంది .

నివారణ చర్యలు :– ద్రవపదార్దాలు , ప్రత్యేకించి నీళ్లను ఎక్కువగా తాగాలి . పండ్లు , ఆకుకూరలు ముతక ధాన్యాలతో కూడిన ఆహారపధార్ధాళ్లతో పాటు పీచు ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవాలి .

ఉదా :-కుకూరలు , కాయగూరలు పప్పుధాన్యాలు . ఎక్కువగా శ్రమపడి ఒత్తిడిని కలిగేలా మలవిసర్జన చేయకూడదు మజ్జిగా లో కొద్దిగా ఉప్పుని మరియు నిమ్మరసం పిండి తీసుకోవాలి మరియు కారం తక్కువగా తీసుకోవాలి మరియు వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి .