ప్రస్తుత రోజుల్లో మనలో చాలా మంది అధికంగా మాంసాహారాన్ని తినడానికే ఇష్టం చూపిస్తున్నారు. ఫ్రెష్ గా, చవకగా దొరికే ఆకు కూరలు తినటానికి ఏ విధంగా ఆసక్తి చూపరు. కానీ ఆకు కూరలు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకు కూరల్లో రోగాలను నిరోధించే గుణం ఉంది. ముక్యంగా పక్షవాతాన్ని నిరోధించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది, అలాగే గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. ఈ ఆకుల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ మగవారిలో వీర్య వృద్ధికి ఎంతో దోహదపడుతుందని, ఇందులో పోలిక్ యాసిడ్ తో పాటు విటమిన్ A, C, ఐరన్ లాంటి విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన కంటికి కూడా ఎంతో మేలును చేస్తాయి.

ముఖ్యంగా ఈ పాల కూరని, కూరగా చేసుకుని తినడం కంటే, వీటిని మిక్సీలో వేసి, గ్రైండ్ చేసి జ్యూస్లా గా చేసుకొని రోజూ ఒక గ్లాసు తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మిరపకాయలను కూడా ఎక్కువగా తీసుకునేవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందట, కానీ ఈ మిరపకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కనీసం కూరల్లో కూడా వాడరు. కానీ చిరు జల్లులు పడే సమయం లో మాత్రం మిరపకాయ బజ్జీలు తినాలని ఫీల్ అవుతారు. మిరపకాయను ఘాటు వల్ల దీన్ని తినటానికి చాలా మంది ఇష్టపడరు. అయితే దీన్ని తగిన మోతాదులో ఉపయోగించడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి మెరుగుపరిచే సామర్థ్యం ఉంది. అందుకే సంతానం లేని వారికి ఇది మంచిగా ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.