కెరీర్ లో సరిగ్గా ప్లానింగ్ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా వృధా అయ్యిపోతుంది. అది చాలా మంది నటీ నటుల విషయంలో ఇప్పటికే ప్రూవ్ అయ్యింది. అయితే తాము దెబ్బతిన్నాము అని విషయం తెలుసుకునే సరికే పుణ్యకాలం గడిచిపోతుంది. ఏం చేయలేని పరిస్దితి ఏర్పడుతుంది.

అలాంటి సిట్యువేషన్ ని తాను ఎదుర్కొన్నా అంటోంది మీరా వాసుదేవ్. ఈ మళయాళ బ్యూటీ అనగానే ఆమె తన్మత్ర సినిమాలో చేసిన పాత్ర అందరికీ గుర్తు వస్తుంది. ఆ సినిమాతో బోలెడు అవార్డ్ లు సైతం ఆమెను వరించాయి. మరో విషయం ఏమిటంటే, ఆ సినిమాలో ఆమె న్యూడ్ గా కనిపించింది. ఆ పాత్ర బాగా క్లిక్ అయ్యింది. అయితే దాన్ని తన కెరీర్ కు నిచ్చెనలా వాడుకోలేకపోయానని ఇన్నాళ్లకు వాపోతోంది. తనను పర్శనల్ గా వాడుకుని బాగుపడ్డ వారి గురించి ప్రస్తావించింది. తన కెరీర్ ఎదుగుదల లేకపోవటం కారణం విశ్లేషించుకుంది.

ముంబై నుంచి వచ్చిన మీరా వాసు దేవా తన్మత్రతో మళయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మోహన్ లాల్, బ్లెస్లీ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో ఆమెది చాలా స్ట్రాంగ్ క్యారక్టర్. ఆ సినిమాలో ఆమె చాలా బ్రిలియెంట్ గా నటించింది. మీడియా మొత్తం అద్బుతం అని పొగిడింది, అవార్డ్ లు వరించాయి. అయితేనేం ఆ తర్వాత ఒక్కటీ సరైన సినిమా పడలేదు. వరస పెట్టి ఫ్లాఫ్ సినిమాలు చేసి పేడవుట్ అయ్యే సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. దీనికి కారణం ఆమె కేవలం తన మేనేజర్ చేసిన కుట్రే అంటుందామె. తాను మళయాళ పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోవటానికి కారణం కేవలం తనకు భాషా సమస్యే అంటుంది. ముంబై యాడ్ వరల్డ్ నుంచి వచ్చిన తాను మళయాళ భాష నేర్చుకోకపోవటంతో చాలా మందితో డైరక్ట్ గా మాట్లాడలేకపోయానని అదే తన కెరీర్ ని దెబ్బ తీసిందని చెప్తుంది.

తన్మత్ర తర్వాత తనకు చాలా ఆఫర్స్ వచ్చాయని, వాటిని తన తన మేనేజర్ డీల్ చేసారని చెప్పింది. తన మేనేజర్ తనకు కమీషన్ ఎక్కువ ఇచ్చే నిర్మాతలకు తన డేట్స్ ఇచ్చేసాడని అంది. పెద్ద నిర్మాణ సంస్దలు, స్టార్ డైరక్టర్స్ అడిగినా తన డేట్స్ లేవని చెప్పాడని ఆ తర్వాత తెలిసిందని అన్నారు. తనను దాదాపు నమ్మించి మోసం చేసాడని, తనను పర్శనల్ ఇంట్రస్ట్ లకు వాడుకున్నాడని అంది. తన మేనేజర్ చెప్పిన సినిమాల్లో తను నటించానని, చాలా కథలు కూడా తనకు తెలియవని, అతనిపై నమ్మకంతో చేసానంది. అతను తెచ్చిన ఏ సినిమా కూడా ఆడలేదని ఆమె అన్నారు. తనను దాదాపు నమ్మించి మోసం చేసాడని. తన ఇమేజ్ ని అడ్డం పెట్టుకుని ఓపినింగ్స్ కు తీసుకెళ్లటం, యాడ్స్ లో చేయించంటం వంటివి చేసి రూపాయిలు దండుకున్నాడని, ఊరు పేరు లేని నిర్మాత, దర్శకులతో చేయాల్సి వచ్చిందిని అన్నారు. నమ్మక ద్రోహం చేసాడని అంది. తనకు వచ్చిన ఛాన్స్ లు అన్ని బ్లాక్ చేసాడని, అందుకు రకరకాల కారణాలు చెప్పేవాడని, మంచి ఆఫర్స్ అన్నీ తనకు నచ్చి, తనతో కలిసి, మెలిసి ఉండే హీరోయిన్స్ కు ట్రాన్శపర్ చేసారని ఆవేదన చెందింది.

నేను ముంబైలో ఎక్కువగా ఉండేదాన్ని, నా వెనక జరుగుతున్న పరిణామాలు నేను గమనించుకోలేక పోయాను, బంగారం లాంటి నా కెరీర్ ని దుర్మార్గుడైన మేనేజర్ చేతిలో నాశనం అయ్యిందని తెలిసే సరికే దాదాపు తాను ఫేడవుట్ అయ్యానని అంది. ఇక మోహన్ లాల్ తో నగ్నంగా చేసిన బెడ్ రూమ్ సీన్ అయితే తన జీవితంలో మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. 2005లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన తన్మాత్రా సినిమాలో మీరా భార్య పాత్ర చేసింది. అయితే ఒక బెడ్ సీన్ లో ఆమె మోహన్ లాల్ తో కలిసి నగ్నంగా నటించింది. అప్పట్లో ఆ సీన్ అనేక విమర్శలకు దారి తీసింది. వివాదాలు తలెత్తటంతో ఆ సినిమా రిలీజ్ కు పలు సమస్యలు తలెత్తాయి. సినిమాతో అనేక అవార్డులను కూడా సొంతం చేసుకున్న మీరా ఆ సీన్ తనకు బాగా ఇష్టమంటుంది. ఆ సీన్ లో నటించడానికి చాలా మంది రిజెక్ట్ చేయగా తాను మాత్రం ధైర్యం గా చేసినట్లు మీరా ఒక ఇంటర్వ్యూలో చేప్పింది. అంతే కాకుండా ఆ సినిమాలో మోహన్ లాల్ తో నగ్నంగా నటించడానికి ఏ మాత్రం ఆందోళన చెందలేదని ఒక విధంగా అంత మంచి సినిమాలో నటించినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పింది.

బోల్డ్ గా కనిపించిన ఆ సీన్ గురించి మాట్లాడుతూ:

ఆ సీన్ షూట్ సమయంలో జనాలు పెద్దగా ఎవరు లేరు. దర్శకుడు బ్లెస్సీ, కెమెరామెన్ సేతు, అసోసియేట్ కెమెరామెన్ అలాగే మోహన్ లాల్ యొక్క మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ మాత్రమే గదిలో ఉన్నారు. మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించడం సంతోషంగా, గర్వంగా ఉందని అన్నారు. మీరా వాసుదేవ్ హిందీ, మలయాళం సినిమాలలో ఎక్కువగా నటించింది. ఇక తెలుగులో ఆమె 16ఏళ్ల క్రితం గోల్ మాల్, అంజలి ఐ లవ్యూ అనే సినిమాలు కూడా చేసింది. తెలుగులోనూ ఏ సినిమా ఆడలేదు. అన్ని ప్లాఫ్ లే కావటంతో ఆమె ఇక్కడ నిలదొక్కుకోలేకపోయింది. మంచి పాత్ర అనిపిస్తే భాషా బేధం లేకుండా నటిస్తానని, తనలో నటన మీద కోరిక పెరగటమే కానీ తగ్గటం లేదని అంది. తెలుగులోనూ మళ్లీ చేయాలనే ఉత్సాహాన్ని ఆమె వెల్లబుచ్చింది. అయితే ఇప్పుడు ఆమెకు ఆంటీ వేషాలు ఇచ్చే డైరక్టర్ ఎవరూ.? త్రివిక్రమ్ ఏమన్నా ట్రై చేస్తారేమో చూడలి.