సింగర్ సునీత లేటెస్ట్ ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశారు. తను రెండో పెళ్లితో పాటు మొదటి వివాహం తర్వాత ఏర్పడిన పరిణామాలు, కెరియర్ లో ఎదురైన ఒడిదుడుకుల గురించి ఎమోషనల్ అయ్యారు.

సునీత మాట్లాడుతూ జీవితంలో కష్టాలు సాధారణం, వాటిని మనం ఎలా ఎదిరించి నిలబడ్డామన్నది నిజం. నాకు ఎదురైనా సంఘటనలో నేను మర్చిపోయాను, చుట్టాలు మాత్రం అప్పుడప్పుడు నేను ఎంత ఏడ్చానో గుర్తు చేస్తూ ఉంటారు.

చాలా విషయాలలో నేను మోసపోయాను, 17 ఏళ్లకి పరిశ్రమకి వచ్చాను, కొన్ని కారణాల వలన 19 ఏళ్లకు వివాహం చేసుకున్నాను, సంపాదన కుటుంబ బాధ్యతలు తీసుకున్నాను, 21ఏళ్లకు కొడుకు ఆకాష్ పుట్టాడు. 24 ఏళ్లకు కూతురు శ్రేయ పుట్టింది. పిల్లల్ని చూసుకుంటూనే సింగర్ గా కొనసాగాను.

నాన్న వ్యాపారం చేసి నష్టపోయారు, ఆయన ఇల్లమ్ముకోవాల్సి వచ్చింది. అలా అంటే పరిస్థితిలో కెరియర్ మొదలు పెట్టాను. 35 ఏళ్లు వచ్చేవరకు కష్టపడుతూనే ఉన్నాను. నా చుట్టూ ఉన్నవాళ్లే నన్ను మోసం చేశారు. అది తెలి సే షాక్ అయ్యేదాన్ని. నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. మాటలు మింగేస్తుందని విమర్శలు చేసేవాళ్లు, 25 ఏళ్ల కెరియర్లో ఐదు వేలకు పైగా షోలు చేశాను. వ్యక్తిగత విమర్శలు స్టూడియో బయట వరకే ఉండాలి.

దేవాలయం ఎదుట చెప్పులు విడిచి లోపలికి వచ్చినట్లు, వ్యక్తిగత విషయాలు బయట నుండి బయట ఉంచే స్టూడియోలోకి రావాలి. నేను చాలా సున్నితంగా ఉంటాను, విమర్శలు తట్టుకోలేను అందుకే ఏడ్చేశాను, రెండో పెళ్లి చేసుకోవడం నేను జీవితంలో చేసుకున్న గొప్ప నిర్ణయం అని అన్నారు. సెకండ్ మ్యారేజ్ అనంతరం మొదటిసారి సునీత కెరియర్ బిగినింగ్ నుండి, జీవితంలో పలు విషయాలు ప్రస్తావించింది. కాగా సునీత కుమారుడు ఆకాష్ హీరోగా సర్కార్ నౌకరి టైటిల్ తో ముగించేస్తున్నారు. 

https://youtu.be/NqYRQ357l1o