నెలసరి సమయంలో స్త్రీలు తప్పనిసరిగా తలస్నానం చేయాలా, ఇంటి బయట కూర్చోవాలా, నెలసరిలో పూజ చేయకూడదా, వంట చేయకూడదా, అని చాలామంది స్త్రీలకు సందేహాలు వస్తూ ఉంటాయి. చాలామంది ఆడవారు నెలసరి రాగానే తల స్నానం చేసేస్తారు. కొంతమంది నెలసరి రాగానే తల స్నానం చేయకపోతే పాపం చిట్టుకుంటుంది అని చెప్తూ ఉంటారు.

మరి అది నిజమేనా అని కొంతమందికి సందేహం వస్తుంది. ఇవే కాక నెలసరి విషయంలో ఆడవారికి చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు అన్నిటికీ సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చాలామంది నెలసరి రాగానే తలస్నానం చేస్తారు కానీ అలా చేయాల్సిన అవసరం లేదు, నెలసరి కంప్లీట్ అయ్యాక అప్పుడు తలస్నానం చేయాలి గాని, స్టార్ట్ అయినప్పుడు చేయకూడదు.

ఎందుకంటే నెలసరి స్టార్ట్ అయినప్పుడు ఒకరోజు పాటు చలిగా నీరసంగా ఉంటుంది. ఆ సమయంలో తలస్నానం చేస్తే చలి పెరిగి మరింత నీరసంగా అనిపిస్తుంది. కాబట్టి పీరియడ్స్ వచ్చినప్పుడు మామూలుగా ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది. అది కూడా వేడి నీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్లతోనే వాతావరణానికి తగ్గట్లుగా స్నానం చేయాలి. చన్నీళ్లతో స్నానం చేయకూడదు, జ్వరంగా ఉన్నప్పుడు నీరసంగా ఉన్నప్పుడు తల స్నానం చేయకూడదు కాబట్టి, పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తల స్నానం చేయకూడదు.

మూడవరోజు గాని, నాలుగవ రోజు కానీ, ఐదవ రోజు గాని శుభ్రంగా తల స్నానం చేసుకోవాలి. ఇక నెలసరిలో కచ్చితంగా ఇంటి బయట కూర్చోవాలా ఇంటి లోపలికి వస్తే అరిష్టం జరిగిపోతుందా అని కొంతమంది సందేహ పడిపోతూ ఉంటారు. పాత రోజుల్లో అయితే పెద్ద పెద్ద ఇల్లు ఉండేది. ముందు పెద్ద వరండా, వెనుక వైపు పెద్ద అడుగు ఉండేది ఇంటి నిండా జనాలు ఉండేవారు. ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అందరూ కలిసి ఉండేవారు.

ఆ రోజుల్లో నెలసరి వస్తే ఆడవారిని ఇంటి వెనుక చాలా దిండు చెంబు ఇచ్చి ఉంచేవారు. ఆ సమయంలో ఆమెకు ఎవరు ఏ పని చెప్పేవారు కాదు. దాంతో నెలసరిలో ఉన్న ఆ స్త్రీ చక్కగా చెట్ల దగ్గర అంటే పెరట్లోని చెట్ల దగ్గర చక్కగా చాప వేసుకుని ఉండేవారు. చాపే ఎందుకంటే నడుం నొప్పి లాంటివి చాప వేసుకుని కింద పడుకుంటేనే తగ్గుతాయి కాబట్టి, అలా చేప మీద పడుకుని పెరట్లో గాలిని ఆస్వాదిస్తూ చెంబులో ఎవరో ఒకరు నీళ్లు పోస్తూ ఉంటే, నీరు ఎక్కువగా త్రాగుతూ విశ్రాంతి తీసుకునేవారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.