ప్రతి ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెలు, అక్క తమ్ముళ్ల మధ్య కోపాలు గొడవలు కామన్, ఎంతగా కొట్టుకుంటారు అంతగా ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉంటారు. తన చెల్లి లేదా తమ్ముడికి ఏ చిన్న కష్టం కలిగిన, ఆ అన్న తల్లడిల్లిపోతాడు,

అలాగే సోదరీ కూడా తన సోదరుడికి ప్రతి విషయంలో అండగా ఉంటుంది. చిన్నప్పటినుండే స్నేహితులారా కలిసి పెరిగినవారు, వివాహమనే బంధంతో విడిపోతారు. ఎవరి జీవితాలు వారివిగా మారిపోతాయి, అలాంటి సందర్భాల్లో ఒక్కసారిగా వారి మధ్య తీవ్ర భావోద్వేగానికి లోనవుతారు. అలాంటి ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజెన్లతో కన్నీరు పెట్టిస్తోంది.

ఈ వీడియోలో పెళ్లి వేడుక జరుగుతుంది, వేదికపై వధువు సోదరుడు ఒక్కసారిగా వరుడి పాదాలపై పడి బోరున ఏడ్చేసాడు. తన చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ, బావగారి కాళ్ళ మీద పడ్డాడు. అది చూసి మిగతా కుటుంబ సభ్యులకు కూడా కన్నీటి పర్యంతమయ్యారు, కానీ అతడు కన్నీళ్లు ఆపడం ఎవరి తరం కాలేదు. చెల్లి ఎదుటే బావ కాళ్ళపై ఏడ్చేసిన ఈ వీడియో నిటిజన్లను సైతం కదిలించింది.

ఈ సమయంలో అతడి బావ కూడా అతన్ని పట్టుకొని ఓదార్చాడు, ఇక చెల్లి కూడా బావురు మంది. ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ వీడియోని ఒక యూజర్ తన ఖాతాలో షేర్ చేస్తూ, అన్నా మరియు సోదరి ఒకరితో ఒకరు గొడవలు పడిన సోదరి పెళ్లి సమయంలో,

ఎక్కువగా ఏడ్చేది అన్న మాత్రమే అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కేవలం 40 సెకండ్ల ఈ వీడియోలోని ఇప్పటికే దాదాపు 70 వేల మంది పైగా వీక్షించగా, వందలాదిమంది లైక్ చేసి పలు రకాల రియాక్షన్ ఇచ్చారు. ఇది నిస్వార్ధ ప్రేమ అని ఒకరు ఇది సహజం ప్రతి సోదరుడికి కలిగే అనుభూతి ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.