నార్మల్ డెలివరీ అయితే భవిష్యత్తుల్లో ఎలాంటి ఇబ్బందులుండవు. దీని వల్ల పుట్టబోయే బిడ్డకు ఎలాంటి అనారోగ్యాలు తలెత్తవు. అయితే వాస్త‌వానికి నార్మల్ డెలివరీ వల్ల పిల్లల్లో వ్యాధి నిరోధ‌క శ‌క్తి బాగుంటుంది.

అంతేకాదు ఇలా ప్రవసం అయితే మదర్ నుంచి చైల్డ్ కి ఒక ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అందుతోంది. నార్మ‌ల్ డెలివ‌రీ త‌ల్లికి కూడా ఎంతో మంచిది. అయితే నార్మ‌ల్ డెల‌వ‌రీ సేఫ్‌గా, సులువ‌గా అవ్వాలంటే ఖ‌చ్చితంగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

నార్మ‌ల్ డెలివ‌రీ అవ్వాలంటే ఎప్పుడు ప‌డుకునే ఉండ‌కుండా ఇంట్లో చిన్న చిన్న ప‌నులు చేస్తుండాలి. నార్మ‌ల్ డెలివ‌రీకి మీ శ‌రీరం రెడీ అవుతుంది. అలాగే బ‌‌రువును అదుపులో ఉంచుకోవాలి.

వైద్యుల స‌ల‌హా మేర‌కు ఏడు, ఎనిమిది నెల‌లు వ‌చ్చే వ‌ర‌కు చిన్న చిన్న‌ వ్యాయామాలు చేస్తుండాలి. వ్యాయామాలు చేయ‌డం వ‌ల్ల శరీరంలో స్టామినా పెరిగ‌డంతో పాటు. నార్మ‌ల్ డెలివ‌రీ అయ్యేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మ‌హిళ‌లకి నార్మ‌ల్ డెలివ‌రీ చేయ‌డం చాలా సులువు అవుతుంది.

మ‌రి ఆరోగ్యంగా ఉండాలంటే. ప్రెగ్నెన్సీ క‌న్ఫామ్ అయిన‌ప్ప‌టి నుంచి పోష‌కాహారం తీసుకోవాలి. కంటి నిండా నిద్ర పోవాలి. మ‌రియు ఒత్తిడిని త‌గ్గించుకోవాలి. అదేవిధంగా, యోగా నిపుణుల సలహాలు తీసుకుని కొన్ని యోగా ఆసనాలు వేస్తుండాలి. అలా చేయ‌డం వ‌ల్ల‌ కండరాలు, పక్కటెముకలు ఫ్రీగా అవుతాయి. దీంతో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.నీరు ఎక్కువ‌గా తీసుకోవాలి. ఆల్కహాల్, టీ, కాఫీల‌కు దూరంగా ఉండాలి.ప్ర‌తి రోజు కాసేపు వాకింగ్ చేయాలి. ఇవి పాటించ‌డం వ‌ల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవ‌కాశాలు పెరుగుతాయి.