పెరిగిన అవగాహనతో చాలా మంది ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగుతున్నారు. ఇందులో కొంతమంది తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గిపోతుందని భావిస్తుంటారు ఇలా చేయడం వల్ల చాలా మంది కొన్ని తప్పులు చేస్తున్నారు వాటిని సరిదిద్దుకోవాలి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

చిగుళ్ల పై ప్రభావం- ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ నేపథ్యంలో శరీరాన్ని సరైన ఆకృతిలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అలాంటివారు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలిపి తాగుతున్నారు అయితే ఇది మంచి అలవాటే కానీ నిమ్మరసాన్ని ఉదయాన్నే ఎక్కువగా తీసుకోవద్దు అని చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల పులుపు శాతం దంతాలపై ఎక్కువగా పడుతుందని చెబుతున్నారు. ఇది ఎక్కువైతే అది దంతాల నుంచి చిగుళ్లపై పడుతుందని చెబుతున్నారు. అందుకే నిమ్మరసం శాతానికి తగ్గించాలని సూచిస్తున్నారు. బ్రష్ అనంతరం అదేవిధంగా ఉదయాన్నే కొంతమంది రాత్రివేళల్లో బ్రష్ చేసుకున్న కదా అని దాన్ని డైరెక్ట్ గా తీసుకుంటారు కానీ ఇలా చేయకూడదు.

నిమ్మరసం తీసుకునే ముందు ఖచ్చితంగా నోటిని శుభ్రం చేసుకోవాలి రెండు మూడు సార్లు నోటిని నీటితో పుక్కిలించాలి ఆ తర్వాత నీటిని తాగాలి లేకపోతే నోటిలోని బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది దీని వల్ల మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సగం నిమ్మపండు కంటే ఎక్కువ వాడకూడదు. నిమ్మరసాన్ని ఎక్కువ వాడితే అసిడిటీ అభివృద్ధి చెందుతుంది అది పనిచేసే అసలు పనికి ఆటంకం ఏర్పడుతుంది. మోతాదుకు మించి అస్సలు వాడొద్దు. చాలామంది చేసే మరో తప్పు ఏమిటంటే జిమ్ జాగింగ్ కి వెళ్ళినప్పుడు దుకాణాల్లో వాటిలో విక్రయించే నిమ్మరసం తాగుతుంటారు ఇది కూడా అంత మంచిది కాదు ఇందులో ఎక్కువగా ప్రిజర్వేటివ్ ఉంటాయి.

ఇది శరీరానికి ఎంతమాత్రం మంచిది కాదు అందుకే ఇంట్లోని సహజ నుంచి తీసిన రసాన్ని మాత్రమే తీసుకోవడం చాలా మంచిది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఆరోగ్యంపై శ్రద్ధ ఉండటం ముఖ్యమే కానీ వీటిని తీసుకుంటే ఏమవుతుందో అన్న అవగాహన కూడా ముఖ్యమే లేకపోతె అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశంఉంటుంది. కాబట్టి ప్రతి విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా ఏదైనా సరే మంచిది కాదని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది అనారోగ్యానికి దారితీస్తుంది. ఏదైనా సరే తగిన పరిమాణంలో తీసుకోవాలి. ఇక ముఖ్యంగా నిమ్మ, నారింజ ఇలాంటి సిట్రస్ జాతి పండ్లని తీసుకున్నప్పుడు ఎక్కువగా ప్రభావం దంతాలపై పడుతుంది కాబట్టి కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.