ఫ్రెండ్స్ ఒక వ్యక్తి స్నానం చేసేందుకు నది తీరానికి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో అతను బిందెను కడుగుతూ ఉండగా, దూరం నుంచి ఒక వస్తువు మెరుస్తూ కనిపించిందట. అదేంటోనీ దగ్గరికి వెళ్లి చూడగా, ఏం కనిపించిందో చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఫ్రెండ్స్ శ్రావణమాసం ప్రారంభమవుతుంది కాబట్టి,

ఈ మాసంలో శివుని ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి చాలామంది భక్తులు శ్రావణమాసంలో శివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. నిశ్చలమైన మనసుతో కొలిస్తే ఆ శివుడు ప్రసన్నుడై అనుగ్రహిస్తాడని, భక్తుల నమ్మకం. అంతేకాదు ఈ పవిత్ర మాసంలో భక్తులు శివలింగానికి నీరు పాలు బిలువ పత్రాలను కూడా సమర్పిస్తారు.

అయితే శ్రావణమాసం ప్రారంభానికి ముందే గాగ్రా నది తీరానికి ఒక వ్యక్తి స్నానం చేసేందుకు వెళ్ళాడు. అక్కడే అతను స్నానం చేసి అతని దగ్గర ఉన్న రాగి చెవును కూడా కడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే అతను రాగి చెంబుతో నీటిని ప్రతిరోజు సూర్యునికి సమర్పిస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో అతనికి దూరం నుంచి ఒక వస్తువు మెరుస్తూ కనిపించింది.

దీంతో ఆత్రుతగా దగ్గరికి వెళ్లి అదేంటో చూడగా, అది వెండి శివలింగం అని నిర్ధారణ అయింది. యూపీలోని మౌవు జిల్లాలో సరయున్నది వంతెన కింద ఇసుకల భారీ వెండి శివలింగం కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. ఇక వెంటనే శివలింగం దొరికిందని స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇక పోలీసుల వ్యక్తిని విచారించి ఆ శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారట.

ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న ప్రజలు శివయ్య దర్శనం కోసం పోలీస్ స్టేషన్కు చేరుకొని పూజలు కూడా చేశారు. ఇక ఆ శివలింగం ఎత్తు 1:30 అడుగులు ఉండగా బరువు 25 నుండి 30 కిలోలు ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సంఘటనపై నిటిజన్లను కూడా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హర హర మహాదేవా అని ఒక వ్యక్తి కామెంట్ పెడుతుంటే, భగవంతుడు భూమి పైకి తిరిగి వస్తున్నాడు కలియుగం ముగింపు దగ్గర పడినట్లు కనిపిస్తుంది అంటూ, మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ శివలింగాన్ని చూశాక మీకేమనిపిస్తుందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి.