ధనస్సు రాశి వారికి ఈ అక్టోబర్ నెల అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అనే జ్యోతిష పండితులు చెబుతున్నారు. అయితే పొరపాటున కూడా మీరు ఈ ఒక్క తప్పు పని చేస్తే మాత్రం, దరిద్రం వెంటాడుతుందని పండితులు చెబుతూ ఉన్నారు. మరి ధనస్సు రాశి వారు ఈ అక్టోబర్ నెల ఏ తప్పు చేయకూడదు,

ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రాశి చక్రంలో ధనస్సు రాశి ది 9వ రాశి, ఈ రాశికి అధిపతి గురువు, ధనస్సు రాశి వారు ధనము కొరకు ప్రాధేయపడరు, ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ మగ అన్న తేడా లేకుండా అందరూ సమానంగా చూస్తారు. ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెబుతారు, ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయక, వారి విచక్షణకు వదిలివేస్తారు.

ధనస్సు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా పని చేయమని బలవంతం చేసిన, ఆ పని చేయరు. అంటే తాము ఇష్టపడితేనే ఆ పనిని చేస్తారు. అయితే ధనస్సు రాశి వారి జాతకం ప్రకారం వీరికి ఈ అక్టోబర్ నెలలో జీవితంలో పైకి ఎదగడానికి చాలా అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఇక మీకు తిరుగు ఉండదు. ఈ నెల మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది.

అప్పులు తీసుకున్న వారు అప్పులను తీర్చగలుగుతారు. ఇతరులకు అప్పుడు ఇచ్చిన వారు కూడా ఈ నెల డబ్బులు తిరిగి పొందుకోగలుగుతారని జ్యోతిష పండితులు చెబుతున్నారు. దానికి సంబంధించిన విషయాలలో చాలా చక్కగా ఆలోచన చేస్తారు. తెలివిగా ఉంటారు. దేనికి ఎంత ఖర్చు చేయాలో అంతే ఖర్చు చేస్తూ ఉంటారు,

డబ్బుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చిన వారేవాటిని చాలా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థికంగా రావలసినటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మొండి బకాయిలు వసూలు చేసే అవకాశాలు, అప్పులు తీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకులో తీసుకున్న లోన్లు తీసేస్తారు లేదా, బ్యాంకులో ఉండే లోన్స్ ని తీసుకుంటారు. అవసరానికి చేతిలో డబ్బు నిలుస్తుంది, ఆర్థికపరంగా ఈ నెల అంతా అద్భుతంగా ఉంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.