దొంగతనానికి వచ్చిన వారు ఏం చేస్తారో ప్లాన్ వేసి, ఇంట్లోకి వెళ్లి దోచుకుంటారు. డబ్బులు నగలు ఇంకేమైనా విలువైన వస్తువులు కనిపిస్తే, వాటిని పట్టుకొని పారిపోతారు.

ఆ ఏరియాలోనే కనిపించరు ఎక్కడైనా ఇదే జరుగుతుంది కానీ, ఇప్పుడు చెప్పబోయే దొంగలు కొంచెం డిఫరెంట్ ఒక దొంగల ముఠా ఒక ఇంట్లోకి వెళ్ళింది. తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో దొంగతనం చేసింది. కనిపించిన బంగారం వెండి నగదును సంచిలో వేసుకున్నారు. అనుకునే లోపే తల తల మెరిసే సీసాలో కనిపించాయి.

ఆ సీసాలు విదేశీ మందని తెలిసి ఆ దొంగలు మరిచిపోయారు, వెంటనే కప్పు తీసి పెగ్గు పెగ్గు వేశారు. అలా మందు ఎక్కువై అక్కడే గురక పెట్టి నిద్రపోయారు, తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే చూడండి. వరంగల్ జిల్లా బాలసముద్రానికి చెందిన కనపర్తి సత్యనారాయణ హనుమకొండ చౌరస్తాలో, వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాల వ్యాపారి, ఈనెల 7న బాలసముద్రంలోని ఇంటికి తాళం వేసి అమెరికాకు వెళ్ళాడు. దీంతో నలుగురు దొంగలు ఆయన ఇంటిపై కన్నేశారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకొని శనివారం రాత్రి అక్కడికి చేరుకున్నారు.

ముందుగా ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు, ఆ తర్వాత తాళాలను పగలగొట్టి మెల్లగా లోపలికి ప్రవేశించారు. బంగారాన్ని వెండి విగ్రహాలను బీరువాలో ఉన్న సుమారు 30 వేల నగదును దోచుకున్నారు. ఇంకా ఏమైనా ఉన్నాయా అని వెతకడం ప్రారంభించారు, ఈ క్రమంలోనే వారికి విదేశీ మద్యం బాటిల్లు కనిపించాయి. ఇక అంతే సంగతి వాటిని చూసే వారి నాలుక లాగేసింది, దొరికిన బాటిల్లను తీసుకువెళ్లి తాగితే లేట్ అవుతుందని భావించి అక్కడే సెట్టింగ్ వేశారు. చక్కగా దొంగతనానికి వచ్చిన ఇంట్లోనే భార్య ఏర్పాటు చేసుకున్నారు.

నాలుగు గ్లాసులు తెచ్చుకున్నారు, స్టాఫ్ కోసం ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారు. అలా రెండు ఫుల్ బాటిల్లను ఖాళీ చేశారు తెల్లవారుజామున సుమారు, నాలుగు గంటల సమయంలో నిద్ర లేచి చోరీ చెప్పుతో బయటికి వచ్చారు. అయితే వారిని ఇరుగుపొరుగువారు చూసి గట్టిగా అరవడంతో, అక్కడి నుండి పరుగులు తీశారు స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించినా, ఫలితం దక్కలేదు. ఏ క్రమంలో తమ చెప్పులు బోట్లు అక్కడే వదిలి వెళ్లారు. ఏది ఏమైనా మందు కోసం కక్కుర్తి పడిన దొంగలు మిస్ అయిపోయారు. ఇంటి యజమాని అమెరికాలో ఉండడంతో, అతడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగల కోసం కాలుస్తున్నారు పోలీసులు..